సీఎంవోకు ఉపాధ్యాయుల బదిలీల దస్త్రం
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహణకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం తెలపడంతో సంబంధిత దస్త్రం ముఖ్య మంత్రి కార్యాలయానికి చేరింది. బదిలీల్లో ఈ ఏడాది కొత్త సవరణ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు అయిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీ ఉండగా... దీన్ని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు అయిదేళ్లుగా మార్పు చేశారు. మిగతా పాయింట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యాక బదిలీలకు ఆదేశాలు వచ్చే అవకాశముంది.
Thanks for reading Transfer file of teachers to CMO


No comments:
Post a Comment