పింఛన్‌దారులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
ఒక చోట నుంచి మరో చోటుకు మారిన పింఛన్‌దారులకు ప్రభుత్వం వెసులుబాటు
అమరావతి: పింఛన్ లబ్ధిదారు సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్‌ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. అలాగే, నిబంధనల ప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనుంది.
పింఛన్ల సొమ్మును దుర్వినియోగ పరచడం.. పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Thanks for reading AP Sarkar good news for Social security pensioners
No comments:
Post a Comment