Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, September 25, 2022

Central Railway Teacher Recruitment 2022: Walk-in-interview for 22 Posts, Salary up to Rs 27,500


 రైల్వే స్కూల్ (English Medium)లో టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడైంది.

ఈ ఖాళీ పోస్టులను సెంట్రల్ రైల్వే(Central Railway) నిర్వహిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి సెంట్రల్ రైల్వే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మహారాష్ట్రలోని DRM కార్యాలయం భుసావల్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ప్రైమరీ టీచర్ (PRT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టులకు నిర్వహిస్తున్నారు. అధికారిక నోటీసు ప్రకారం.. వాక్-ఇన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ 4 అక్టోబర్ 2022న ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. "ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు కనీసం రెండు రోజుల పాటు భుసావల్‌లో ఉండటానికి సిద్ధంగా ఉండాలి" అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి వసతి మరియు ఆహారం అందించబడదని పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సెంట్రల్ రైల్వే సంస్థలోని మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తుంది.అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించారు.

ఖాళీల వివరాలు:

పీజీటీ: 5 పోస్టులు (కెమిస్ట్రీ, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ మరియు ఎకనామిక్స్- ప్రతీ సబ్జెక్ట్ ఒక్కో పోస్టు చొప్పున..)

TGT: 8 ఖాళీలు (సైన్స్ & మ్యాథ్స్ -1), (ఇంగ్లీష్ & SST 6 మరియు హిందీ 1 పోస్ట్) PRT: 9 ఓపెనింగ్స్ (కళలు & క్రాఫ్ట్, కౌన్సెలర్, మరాఠీ, సంగీతం, PTI విభాగంలో ఒక్కపోస్టు.. ఇంగ్లీష్ , మ్యాథ్స్ ఒక్కొక్కటి రెండు పోస్టులను కేటాయించారు.

రిక్రూట్‌మెంట్ అనేది 2022-2023 అకడమిక్ సెషన్‌కు ఒప్పందం ప్రకారం నియమించనున్నారు.

విద్యా అర్హతలు:

PG ఉపాధ్యాయులు - సంబంధిత సబ్జెక్టులో NCERT ప్రాంతీయ విద్యలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ MSC కోర్సు లేదా కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా.. B.Ed లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి. హిందీ మరియు ఇంగ్లీషు మాధ్యమంలో బోధనలో ప్రావీణ్యం ఉండాలి.

TGT టీచర్ - గ్రాడ్యుయేట్ మరియు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 2 సంవత్సరాల డిప్లొమా లేదా కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉండాలి. దీనితో పాటు.. B.Ed లేదా 12th మరియు B.Ed OR 12th మరియు BA/B.Sc లేదా BA.Ed/B.Sc కలిగి.. టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

PRT - డిప్లొమాతో 12వ తరగతి లేదా B.El.Edతో 12వ తరగతి లేదా డిప్లొమాPRT సంగీతంతో గ్రాడ్యుయేషన్ ఉండాలి.

ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోస్టులకు- డిప్లొమా ఇన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసి ఉండాలి.


జీతం:

PGT - రూ. 27500

TGT- రూ. 26250

PRT - రూ. 21250

వయో పరిమితి..

నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 మరియు 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

నిబంధనలు..

ఈ రిక్రూట్‌మెంట్ కాంట్రాక్ట్ ఆశావహులను ఏడు రోజుల కంటే ఎక్కువ .. 200 పనిదినాల వరకు పని చేసే విధంగా అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ రోజు 5 పీరియడ్లను బోధించాలి.

Notification Here

Thanks for reading Central Railway Teacher Recruitment 2022: Walk-in-interview for 22 Posts, Salary up to Rs 27,500

No comments:

Post a Comment