Botsa satyanarana : మరోసారి చర్చలకు సీపీఎస్ సంఘాలకు మంత్రి బొత్స నుంచి పిలుపు
అమరావతి: సీపీఎస్ సంఘాలకు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana) నుంచి మరోసారి చర్చలకు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా ఏపీసీపీఎస్‌ఈఏ (APCPSEA), ఏపీసీపీఎస్‌యూఎస్ (APCPSUS) సంఘాలకు పిలుపు వెళ్లింది.
సీపీఎస్ (CPS) అని పిలిచి జీపీఎస్ (GPS)పై చర్చిద్దామంటే ఏం చేయాలనే దానిపై ఆయా సంఘాల తర్జన భర్జన పడుతున్నాయి. సమావేశానికి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలు (CPS Trade Unions) ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 11న ఛలో విజయవాడ, మరో మిలియన్ మార్చి ర్యాలీ, సభలకు విజయవాడ సీపీ కార్యాలయంలో అనుమతికి యత్నించగా.. అనుమతి ఇంకా లభించలేదు. మరోవైపు ఛలో విజయవాడ, మిలియన్ మార్చి కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే బొత్సా (YCP Leader) ఆఫీస్ నుండి కాల్ రావడంతో ఉద్యోగులు తర్జనభర్జన పడుతున్నారు.
వెళ్ళిన ప్రతిసారి సీపీఎస్ నుండి కిందకు రండి జీపీఎస్ నుండి పైకి వస్తామని ప్రభుత్వం (AP Government) చెబుతోంది. తాము జీపీఎస్‌కు అంగీకరించేది లేదంటూ బొత్సా (YCP Minister)కు గతంలోనే సీపీఎస్ సంఘాలు తెగేసి చెప్పాయి. ఇప్పటికే పలువురు సీపీఎస్ సంఘాల నేతలపై సెప్టెంబర్ 1 కి ముందు బైండ్ ఓవర్ కేసులు, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. వీటిని అడ్డంపెట్టి సీపీఎస్ ఉద్యోగ సంఘాలను జీపీఎస్‌కు ఒప్పించే ప్రయత్నం జరుగుతోందని ఉద్యోగసంఘాలు ఆరోపిస్తున్నాయి
Thanks for reading Botsa satyanarana: Minister Botsa's call to CPS unions to discuss once again
No comments:
Post a Comment