Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 6, 2022

Voter ID Aadhaar Link: Is Aadhaar Number Linked to Voter ID? Follow these simple steps


 Voter ID Aadhaar Link : ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేశారా ? ఈ సింపుల్ స్టెప్స్ చేయండి

ఎన్నికల కమిషన్ వోటర్ ఐడీలకు ఆధార్ నెంబర్లను లింక్ (Voter ID Aadhaar Link) చేసే డ్రైవ్‌ను ఇటీవల ప్రారంభించింది.

ఓటర్ ఐడీ కార్డ్ (Voter ID Card) ఉన్నవారు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయొచ్చు. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్ (Aadhaar Card) లింక్ చేయడం ద్వారా ఒక వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నా లేదా ఒకే నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నా తెలుస్తుందని ఎన్నికల కమిషన్ (Election Commission) వెల్లడించింది. అయితే ఓటర్ ఐడీ ఉన్నవారు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరేమీ కాదు. ఇది స్వచ్ఛందం మాత్రమే. అంటే ఓటర్లు ఇష్టపూర్వకంగానే ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు.

గతేడాది పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను గుర్తించేందుకు, రిగ్గింగ్‌ను అడ్డుకోవడానికి బయోమెట్రిక్ వ్యవస్థను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 కి ఆమోదముద్ర పడ్డ తర్వాత ఆధార్ వ్యవస్థకు ఓటర్ల డేటాను లింక్ చేసే ప్రాసెస్ ప్రారంభమైంది. ప్రస్తుతం వోటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేసే ప్రాసెస్ కొనసాగుతోంది. మీరు కూడా మీ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయండిలా

Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'Voter Helpline' యాప్ ఇన్‌స్టాల్ చేయండి.

Step 2- యాప్ ఓపెన్ చేసిన తర్వాత 'Voter Registration' ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

Step 3- ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పైన క్లిక్ చేయండి.

Step 4- ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.

Step 5- 'Yes I have voter ID' ఆప్షన్ సెలక్ట్ చేసి నెక్స్‌ట్ పైన క్లిక్ చేయాలి.

Step 6- మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేయాలి.

Step 7- 'Fetch Details' పైన క్లిక్ చేయాలి.

Step 8- ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.

Step 9- ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి 'Done' పైన క్లిక్ చేయాలి

మీ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. www.nvsp.in వెబ్‌సైట్‌లో కూడా ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పూర్తి చేసి ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. లేదా మరిన్ని వివరాలకు మీ బూత్ లెవెల్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు. ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి తేదీ ఏమీ లేదు.



Thanks for reading Voter ID Aadhaar Link: Is Aadhaar Number Linked to Voter ID? Follow these simple steps

No comments:

Post a Comment