Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, September 5, 2022

CM Jagan: Those changes will not bother teachers: CM Jagan


 CM Jagan: ఆ మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావు: సీఎం జగన్‌

విజయవాడ: మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా శిల్పంలా మారుతుందని.. అద్భుత శిల్పాలు చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం జగన్‌ మాట్లాడారు. ఉపాధ్యాయులందరికీ టీచర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సబ్జెక్ట్‌తో పాటు వివేకాన్ని కూడా పెంచుతారని.. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తారన్నారు.

‘‘స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రపంచంతో పోటీ పడలేని.. తమపై రుద్దిన చదువును వేరే గత్యంతరం లేక చదువుకుంటున్న దుస్థితి. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా దృష్టి సారించి మార్పులు చేస్తోంది. ఈ మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావు.. వారిని ఇబ్బంది పెట్టాలని తీసుకున్న నిర్ణయాలూ కావు. ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగ్గా ఉంచేందుకు తీసుకొస్తున్న మార్పులు. అట్టుగడున ఉన్న పేద సామాజిక వర్గాల చరిత్రను పూర్తిగా మార్చేవి. మరింత అర్థవంతమైన, భవిష్యత్‌ తరాలకు అవసరమైన చదువుల కోసం అడుగులు ముందుకు వేస్తున్నాం. మంచి చదువులకు పేదరికం అడ్డు కాకూడదని.. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని చేస్తున్న మార్పులివి. 

 అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా విద్యారంగాన్ని తీర్చిదిద్దుతూ అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ బడికి ఆ గుర్తింపు, వైభవం రావాలన్న తపనతో మార్పులు చేస్తున్నాం. హాజరుశాతం.. అక్షరాస్యత పెంచడం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కార్పొరేట్‌ స్కూల్‌ కంటే ప్రభుత్వ బడి బాగుండాలని మార్పులు చేస్తున్నాం. పేదల పిల్లలు మాత్రమే కాకుండా టీచర్ల పిల్లలు కూడా అదే ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి రావాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది’’ అని జగన్‌ చెప్పారు. అనంతరం రాష్ట్రంలోని 176 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం అందజేశారు.

Thanks for reading CM Jagan: Those changes will not bother teachers: CM Jagan

No comments:

Post a Comment