Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, September 30, 2022

Group -I /APPSC Group -I Services Notification


 Group -I /APPSC Group -I Services Notification



Download Hall tickets click Here


  1. Group 1 Notification: ఏపీలో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ
  2. అక్టోబర్‌ 13 నుంచి నవంబర్‌ 2 వరకు దరఖాస్తులకు గడువు
  3. ఎఎంవీఐ పోస్టులకు నవంబర్‌ 2 నుంచి 22 వరకు..
  4. ఇంటర్వ్యూల విధానం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ
  5. గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు

రాష్ట్రంలో గ్రూప్‌–1 కేడర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్‌లో గ్రూప్‌–1 పోస్టులతో పాటు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌. అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

 ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పించారు. దీంతో పాటు.. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ Inspector (AMV) ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఏపీపీఎస్సీ.గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు

గ్రూప్‌–1 సహా అత్యున్నత కేడర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

ఇలా ఉండగా.. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్‌–1 సహా ఇతర అత్యున్నత కేడర్‌ పోస్టులకు రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని పునరుద్ధరించింది. ఈ అత్యున్నత పోస్టులన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వయోపరిమితి..

 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి రెండేళ్లకు పెంచుతూ గతంలో జారీచేసిన జీఓ 105 అమలును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. గతంలో 34ఏళ్ల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచి జీఓ 105 జారీచేశారు. తాజా ఉత్తర్వులతో ఈ 42ఏళ్ల గరిష్ట వయోపరిమితి 2023 సెప్టెంబర్‌ 30వరకు అమల్లో ఉంటుంది.

విభాగాల వారీగా పోస్టుల వివరాలిలా..

1. డిప్యూటీ కలెక్టర్ - 10

2.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12

3.డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13

4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02

5.డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02

6. అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08

7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02

08. MPDO - 07

09. జిల్లా రిజిస్ట్రార్స్ - 03

10. జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01

11. జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 02

12. గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06

13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు మాత్రం ఇంజనీరింగ్  ఫైర్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఒక వేళ అభ్యర్థులకు ఇలాంటి అర్హత లేకుంటే.. బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా పరిగణించనున్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: 13.10.2022

దరఖాస్తుల సమర్పించడానికి ఆఖరి తేదీ: 02.11.2022 05.11.22

Download Group-I Syllabus

Download Complete Notification

Official Website: Click Here


ATTENTION: Web note for Extended for Online Application Submission for Group-I Services - Notification No.28/2022 (General/ Limited Recruitment) - (Published on 02/11/2022)- Click Here


Web Note for Downloading Hall Ticket for Group- I Services - Notification No.28/2022 - (Published on 29/12/2022) - Click Here


Download Hall tickets click Here

Thanks for reading Group -I /APPSC Group -I Services Notification

No comments:

Post a Comment