మాకు ఇగో లేదు.. ఉద్యోగులకు మంచి చేయాలనేదే మా తపన: మంత్రి బొత్స
అమరావతి: ఉపాధ్యాయ సంఘాల నేతలతో రెండు అంశాలపై చర్చించామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 670 ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలని సీఎం చెప్పారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం పెండింగ్‌లో ఉన్న 248 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సీనియారిటీ ఆధారంగా ఎంఈవోలుగా నియమిస్తామని వెల్లడించారు.
ముఖ ఆధారిత యాప్‌పై వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలనేదే ముఖ్యమంత్రి భావన అని తెలిపారు. తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీచర్స్‌పై పెట్టిన కేసుల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాము ప్రవేశపెట్టింది ఎప్పటి నుంచో వస్తున్న సిస్టమేనని.. కొత్తగా పెట్టింది ఏమీ లేదన్నారు. సర్వీస్ రూల్స్‌లో ఏమున్నాయో వాటిని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇవాళ 86శాతం మంది టీచర్స్ యాప్‌లో హాజరు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. తమకు ఇగో లేదని, ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి చేయాలనేదే మా తపన అని వివరించారు. కొత్తగా 38 డిప్యూటీ డీఈవో పోస్టులు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.
★★★★★★★★★★★★★★★★★★★
*✳️సమావేశం లో కీలక నిర్ణయాలు*
1.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఇద్దరు MEO లు ప్రస్తుత ఖాళీలు 248 Govt.Teachers కు కొత్తగా వచ్చే 672 పోస్టులు ZP Teachers కు కేటాయిస్తారు.
2.Transfers లో 5సం.లు గరిష్ట సర్వీస్ తో అప్రూవ్ అయింది. కానీ మనం 8 సం.లు అడిగాం.
3.ఫేషియల్ ఆప్ తో జీతాలు, ట్రెజరీ link up లేదు.
4.టెక్నికల్ సమస్యలతో ఫేషియల్ ఆప్ క్యాప్చర్ కాకపోతే ఉపాధ్యాయులకు సంబంధం లేదు.
5. అందరూ రేపటి నుంచి ఫేషియల్ ఆప్ హాజరు వేయాలి.
6.పదోన్నతులు సమస్య Govt./ZP ది పరిష్కారానికి C.M. గారు సుముఖంగా ఉన్నారు
7.ఫేషియల్ ఆప్ సమస్యలు సంఘాలు ప్రాతినిథ్యం మంత్రి గారి సమర్పించాము.
8. ఫేషియల్ ఆప్ DEVICE ప్రభుత్వం ఇవ్వదు.
9.ఫేషియల్ ఆప్ Time taking, blink, turn, be in the frame, one person, image not matched, straight head ఇవన్నీ త్వరలో పరిష్కరిస్తారు.
10.తిరిగి 15 రోజుల తర్వాత సమీక్ష సమావేశం ఉంటుంది.
Thanks for reading Highlights of today's meeting of the Minister of Education with recognized associations
No comments:
Post a Comment