JioMart Festival Offers : జియోమార్ట్ లో ఆఫర్ల పండుగ .. ఏకంగా రెండు స్పెషల్ సేల్స్ .. ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు
భారతదేశంలోని ప్రముఖ ఈ-మార్కెట్ ప్లాట్ ఫాంలలో ఒకటైన రిలయన్స్ రిటైల్ వారి జియోమార్ట్ (JioMart) రాబోయే పండుగ సీజన్ కోసం తన నెల రోజుల పండుగ సంబరాల జాబితాను ఈ రోజు విడుదల చేసింది.
ఫెస్టివల్ సీజన్ సేల్ (Festival Sale) ఈ రోజు ప్రారంభించినట్లు తెలిపింది. ఈ సేల్ 2022 అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. జియోమార్ట్ ఈ సమయంలో రెండు సేల్స్ ను నిర్వహిస్తుంది: అవి 'త్యోహార్ రెడీ సేల్' (#TyohaarReadySale) మరియు 'బెస్టివల్ సేల్'(Bestival Sale). జియోమార్ట్‌కు ప్రధానమైన కిరాణాతో పాటు ఎలక్ట్రానిక్స్, గృహ, వంట సామాన్లు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, సౌందర్య ఉత్పత్తులు, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌పై కస్టమర్లు 80% వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ దీపావళికి తన వినియోగదారుల షాపింగ్ అవసరాలకు, ఆహారం నుండి ఫ్యాషన్ ఉత్పత్తుల వరకు అన్నింటికీ ఏకైక వేధికగా నిలవాలని జియోమార్ట్ సంకల్పించింది. నెల రోజుల పాటు జరిగే షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా జియోమార్ట్ తన కస్టమర్లకు ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) డెబిట్ కార్డులపై అదనపు ఆఫర్ అందించనున్నట్లు తెలిపింది.
కస్టమర్లు యాప్‌పై పరిమిత కాల 'ఫ్లాష్ డీల్స్' చూడవచ్చు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ హెచ్డీ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, మొబైల్ యాక్ససరీలు వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉంటాయి. బ్రాండెడ్ ఉత్పత్తులతో పాటు రిలయన్స్ రిటైల్ యాజమాన్యంలోని రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ వంటి బ్రాండ్లపై అదనపు ఆఫర్లు ఉంటాయి.
భారతదేశంలో స్థానిక చేతివృత్తుల వారి జీవనోపాధిని బలోపేతం చేయడానికి, వారి జీవితాలను మార్చడానికి జియోమార్ట్ ఈ పండుగ సీజన్‌లో మొట్టమొదటిసారిగా సంప్రదాయ చేతివృత్తులవారిని, నేత కార్మికులను ఆన్ బోర్డ్ చేసింది. ఈ పండుగ సీజన్ లో స్వచ్ఛమైన సహజమైన ఆనందం అందించేలా తోలు బూట్లు, బెంగాలీ చేనేత చీరలు మరియు సొగసైన చేనేత సంబల్ పురి చీరల నుండి, ఫూల్కారీ, చికాంకారీ, సాంప్రదాయ ఆభరణాలు మొదలైన వాటి వరకు ఈ చేతివృత్తులవారి నుండి సృజనాత్మక హస్తకళా నైపుణ్యపు విస్తృత శ్రేణి అందుబాటులోకి రానుంది.
ఈ సేల్ పై జియోమార్ట్ సీఈఓ శ్రీ సందీప్ వరగంటి మాట్లాడుతూ.. "అతిపెద్ద బహుళ ఛానల్ స్వదేశీ ఈ-మార్కెట్ ప్లేస్‌లలో ఒకటిగా, స్థానిక దుకాణాలు, కిరాణాలను, ఎస్ఎంబీ (చిన్న, మధ్యతరహా వ్యాపారాలు), ఎంఎస్ఎంఈలను, స్థానిక చేతివృత్తుల వారిని, అభివృద్ధి చెందుతున్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను శక్తిమంతం చేయడం ద్వారా డిజిటల్ రిటైల్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఈ లక్ష్యం దిశగా మేము విక్రేతలు, స్థానిక చేతివృత్తులవారిని మా ఈ-కామర్స్‌లో చేరుస్తున్నాం. ఈ సెగ్మెంట్లలో కేటగిరీలను కూడా విస్తరించాం, మునుపటి సంవత్సరంతో పోలిస్తే SKUలను 80 రెట్ల కంటే ఎక్కువ పెంచాం. ఇటీవలే ప్రారంభించిన జియోమార్ట్-వాట్సప్ ఆర్డరింగ్‌కు మా కస్టమర్ల నుంచి మంచి ఆదరణ వచ్చింది. రాబోయే పండుగ సీజన్లో, జియోమార్ట్ ద్వారా విక్రేతలు, వినియోగదారులతో మా సంబంధాన్ని బలోపేతం చేయగలమని విశ్వసిస్తున్నాము'' అని అన్నారు.
దేశానికి హృదయంలాంటి ప్రాంతాలన్నిటినీ చేరుకునే కార్యక్రమాలను మేం విస్తరిస్తామన్నారు. థర్డ్ పార్టీ అమ్మకపు భాగస్వాములతో పాటుగా, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్ సహా మా విస్తృతమైన భౌతిక దుకాణాల నెట్ వర్క్ ద్వారా డెలివరీలు సకాలంలో చేసేలా చూస్తామన్నారు.
దీపావళి స్పెషల్ ఆఫర్లు: ఎలక్ట్రానిక్స్, కిరాణా, ఫ్యాషన్, గృహ, వంట సామగ్రి, సౌందర్య ఉత్పత్తులు మొదలైన కేటగిరీల్లో 80% వరకు ఆఫ్ పొందండి. దయచేసి ప్రతి 3 గంటలకు ఫ్లాష్ డీల్స్‌ని చెక్ చేసుకోండి, రూ. 6999/- నుంచి ప్రారంభమయ్యే స్మార్ట్ ఫోన్ ల కోసం చూడండి!
ఎస్బిఐ బ్యాంక్ డెబిట్ కార్డు ఆఫర్: ఎస్‌బిఐ బ్యాంక్ డెబిట్ కార్డును ఉపయోగించి, కనీస ఆర్డర్ విలువ రూ. 1000/- పై అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందడం కోసం, మరిన్ని వివరాల కోసం, జియోమార్ట్ ని సందర్శించండి.
Thanks for reading JioMart Festival Offers: Festival of offers in Jiomart .. two special sales simultaneously .. discounts up to 80 percent simultaneously
No comments:
Post a Comment