SSC Job Notification 2022 : నిరుద్యోగులకు భారీ శుభవార్త .. 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ .. ఇలా అప్లై చేసుకోండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) దేశంలోని నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (SSC Job Notification) విడుదల చేసింది.
ఈ ఖాళీలను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022 ద్వారా భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్, SI, టాక్స్ అసిస్టెంట్ C, UDC, అసిస్టెంట్, అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO), ఇన్‌స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.
విద్యార్హతల వివరాలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు గ్రూప్ సీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, గ్రూప్ బీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 17
దరఖాస్తులకు ఆఖరి తేదీ: అక్టోబర్ 8
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్: అక్టోబర్ 9
ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ: అక్టోబర్ 10
దరఖాస్తు విధానం
Step 1:ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ ssc.nic.in ను సందర్శించాలి.
Step 2:హోమ్‌పేజీలో, లెటెస్ట్ న్యూస్ సెక్షన్‌ను చెక్ చేసి, సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 3:లాగిన్ కోసం తమ వివరాలతో అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి.
Step 4:తరువాత లాగిన్ అయి, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
Step 5:చివరగా దరఖాస్తు రుసుము చెల్లించి, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
Thanks for reading SSC Job Notification 2022 : Huge good news for unemployed .. Notification for filling 20 thousand jobs .. Apply like this
No comments:
Post a Comment