Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 9, 2022

Are you closing your savings account in the bank? Know these things


 బ్యాంక్‌లో సేవింగ్స్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్‌!


ప్రస్తుత రోజుల్లో బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇందులో ఎక్కవ శాతం సేవింగ్స్‌ ఖాతాదారులే ఉన్నారన విషయం విదితమే. కొందరు అవసరమై, లేదా ఏదైనా ప్రయోజనం కోసం సేవింగ్స్‌ ఖాతాను ఒకే బ్యాంక్‌లో లేదా వేర్వేరు బ్యాంకుల్లో తెరుస్తుంటారు. ఈ క్రమంలో పనైపోయాక సదరు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ ఉంచలేక, లేదా బ్యాంక్‌ చార్జీలు భరించలేక ఆ అకౌంట్‌ని క్లోజ్‌ చేయాలని అనుకుంటుంటారు. అయితే మీ సేవింగ్స్‌ ఖాతా మూసివేసే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

1. అకౌంట్‌ క్లోజ్‌ చేసే ముందు బ్యాలెన్స్‌ చెక్‌ చేయండి
సేవింగ్స్‌ అకౌంట్‌ను మూసివేసే ముందు, కస్టమర్లు వారి ఖాతా బ్యాలెన్స్‌ని చెక్‌ చేయడం ఉత్తమం. దీంతో పాటు స్టేట్‌మెంట్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది మీకు భవిష్యత్తులో ఉపయోపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు మీ స్టేట్‌మెంట్ సమర్పించాల్సి  ఉంటుంది.
2. ఆటోమేటెడ్ పేమెంట్లను రద్దు చేయండి.
కస్టమర్లు వారి ఖాతా ద్వారా లోన్ ఈఎంఐ (EMI)లు, బిల్లు చెల్లింపులు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ మొదలైన వాటికి ఆటోమెటిక్‌ విధానంలో ప్రతి నెల చెల్లిస్తుంటారు. మీ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తున్నారంటే ముందు ఈ తరహా చెల్లింపులను రద్దు చేయడంతో పాటు మరో ఖాతాకు ముందుగానే బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డిఫాల్టర్‌ ముద్రపడే ప్రమాదముంది.  
3. బకాయిలు-చార్జీలు
ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకపోతే దానికి సంబంధించిన బకాయిల్ని చెల్లించకుండా ఆ ఖాతాను మూసేందుకు బ్యాంకులు అంగీకరించవు. అలాగే ఇతర సేవలకు సంబంధించిన చార్జీలనూ తప్పక చెల్లించాలి. లేకపోతే మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతుంది.
4. వివిధ పోర్టల్స్ నుండి మీ సేవింగ్స్ ఖాతాను డీ-లింక్ చేయండి
సంస్థల నుంచి సేవలను పొందేందుకు కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్‌ఓ (EPFO), ఐటీ శాఖ మొదలైన వాటితో లింక్ చేస్తారు. ఒక వేళ మీ సేవింగ్స్ ఖాతాని క్లోజ్ చేస్తున్నట్లయితే మరొక ఖాతా నంబర్‌తో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాక పెట్టుబడులు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ ఖాతానే లింకై ఉంటే మార్పించుకోవాలి. అలా చేయకపోతే సదరు సంస్థల సేవలను వినియోగించుకోలేరు. దీంతో పాటు భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

Thanks for reading Are you closing your savings account in the bank? Know these things

No comments:

Post a Comment