Surya Grahan 2022: మంగళవారం సూర్య గ్రహణం.. రాశుల వారీగా ఫలితాలు ఇలా..!
ఈ పాక్షిక సూర్య గ్రహణం మంగళవారం సాయంత్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26గంటలకు ముగియనుంది. దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా అక్టోబర్ 25న మంగళవారం ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్య గ్రహణం(Solar Eclipse) ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం మంగళవారం సాయంత్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26గంటలకు (ప్రాంతాల్ని బట్టి స్వల్పంగా మార్పులు ఉండొచ్చు) ముగియనుంది. గ్రహణ మధ్య కాలం సాయంత్రం 5.29 గంటలు కాగా.. గ్రహణ పుణ్యకాలం 1.25గంటలుగా ఉంటుంది. ఈ గ్రహణం స్వాతి నక్షత్రం నందు సంభవించడం వల్ల తులరాశి వారు చూడకుండా ఉండటమే మంచిది. ఈ గ్రహణం సాయంత్రం వేళ ఏర్పడుతుండటంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆహార నియమాలు పాటించాలి.
ఈ గ్రహణం సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుంది. కన్య, మేషం, కుంభం, మిథునం రాశులకు మధ్యస్త ఫలితాలు ఉంటాయి. తుల, కర్కాటక, మీన, వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగును. సూర్య గ్రహణం సమయంలో తలస్నానం ఆచరించడం (పట్టు విడుపు స్నానాల చేయడం), సూర్య ఆరాధన చేసుకోవడం, రాహు జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలుంటాయి. మోక్ష సాధకులకు సూర్య గ్రహణం సమయంలో చేసే ధ్యానానికి విశేష ఫలితాలు ఉంటాయి. సూర్య గ్రహణం రోజే దీపావళి పండుగ కావడం వల్ల.. ఈ గ్రహణం సాయంత్రం 6.30గంటలకు సమాప్తమయ్యాక రాత్రి 7గంటల నుంచి లక్ష్మీ దీపారాధన, దీపావళి పండుగను యధావిథిగా చేసుకోవచ్చు.
Thanks for reading Surya Grahan 2022: Solar eclipse on Tuesday.. Zodiac wise results like this..!
No comments:
Post a Comment