Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 27, 2022

AFCAT 2023: Air Force Common Admission Test (AFCAT)


 AFCAT 2023: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌)

వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులు రాయాల్సిన పరీక్షల్లో ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ముఖ్యమైంది. ఇందులో విజయం సాధించి, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిస్తే శిక్షణ అనంతరం ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. సాధారణ డిగ్రీ/ బీటెక్‌ పూర్తయినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు వీటికి పోటీ పడవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది. తాజాగా ఏఎఫ్‌ క్యాట్‌ - 01/2023 ప్రకటన విడుదలైంది.

వివరాలు:

* ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌) 01/ 2023, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

బ్రాంచి, ఖాళీలు:

1. ఫ్లయింగ్: 10(పురుషులు- 5, మహిళలు- 5)

2. గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్): 130(పురుషులు- 117, మహిళలు- 13)

బ్రాంచ్‌: ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌

3. గ్రౌండ్ డ్యూటీ(నాన్-టెక్నికల్): 118(పురుషులు- 103, మహిళలు- 15)

బ్రాంచ్‌: వెపన్‌ సిస్టమ్‌, అడ్మినిస్ట్రేషన్‌, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్‌, ఎడ్యుకేషన్‌, మెటియోరాల‌జీ

మొత్తం ఖాళీల సంఖ్య: 258.

అర్హతలు: 

* ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. క‌నీస ఎత్తు 162.5 సె.మీ ఉండాలి. 

* గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్ పోస్టుల‌కు ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌(ఎల‌క్ట్రానిక్స్‌/మెకానిక‌ల్) విభాగాల్లో లేదా అనుంబంధ బ్రాంచీల్లో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. ఇంట‌ర్‌ ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఉత్తీర్ణత త‌ప్పనిస‌రి. పురుషులు 157.5 సెం.మీ, మ‌హిళ‌లు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. 

* గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్‌) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ లేదా బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ సీఎఫ్‌ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. పురుషులు 157.5 సెం.మీ, మ‌హిళ‌లు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. 

* ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.  

వయో పరిమితి: ఫ్లయింగ్‌ బ్రాంచి పోస్టులకు జనవరి 1, 2024 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్‌/ నాన్ టెక్నిక‌ల్ బ్రాంచీల‌కు 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. అవివాహితుల‌కే అవ‌కాశం.

జీత భత్యాలు: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం ఫ్లయింగ్ ఆఫీసర్‌ ర్యాంకుతో రూ.177500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్సులు ఉంటాయి. మిలటరీ సర్వీస్‌ పేలో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. ఇతర సౌకర్యాలూ ఉంటాయి.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాలను నిర్వహించి శిక్షణకు ఎంపికచేస్తారు.  

శిక్షణ వ్యవధి: అభ్యర్థులకు సంబంధిత విభాగంలో జనవరి మొదటి వారం, 2024 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ అభ్యర్థులకు 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాల వారికి 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు.

పరీక్ష రుసుం: రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 01-12-2022 నుంచి 30-12-202 వరకు.

ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 24, 25, 26-02-2023.

శిక్షణ ప్రారంభం: 2024, జనవరిలో.

Website Here

Notification Here

Thanks for reading AFCAT 2023: Air Force Common Admission Test (AFCAT)

No comments:

Post a Comment