State Awards: 4 కేటగిరీల్లో విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డులు
అమరావతి: ఏపీ ఉన్నత విద్యామండలి ఇటీవల నిర్వహించిన ప్రభావవంతమైన విద్యార్థి, సంఘ సేవ, ఉత్తమ విద్యార్థి అవార్డుల పోటీల్లో మొదటి 4 స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభావవంతమైన విద్యార్థి అవార్డు కేటగిరీలో... వరసగా నాలుగు స్థానాల్లో మేడిశెట్టి సాయికిరణ్ (ఆంధ్ర లయోలా కళాశాల), అన్నపురెడ్డి హర్షిత (లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల), పొట్నూరు దీపిక (జీఎంఆర్ టెక్నాలజీ), వీఎన్ మణితేజ (లెండి కళాశాల) నిలిచారు. సంఘ సేవ విభాగంలో... విశాల్ తేజ (నిట్ తాడేపల్లిగూడెం), మేఘన కట్టా (ఆంధ్ర లయోలా), వి.శ్రీహర్షిత (రఘు కళాశాల), లక్ష్మి దీపికారెడ్డి (ఆదిత్య కళాశాల) మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఉత్తమ విద్యార్థి కేటగిరీలో... జి.ప్రసూన (ట్రిపుల్‌ఐటీ, ఆర్కేవ్యాలీ), షేక్ ఖాజీపూర్ అజారుద్దీన్ (వీవీఐటీ), ఇప్పిలి పావని (విజ్ఞాన్), బి.అంజలి (సెయింట్ జోసెఫ్ కళాశాల) నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, ద్వితీయకు రూ.60 వేలు, తృతీయకు రూ.30 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందిస్తారు.
Thanks for reading State Awards: State level awards for students in 4 categories
No comments:
Post a Comment