AP Constable, SI Recruitment 2022 Notification, Appy Online
Website Here
Download Results for SI Click Here
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత 20 రోజుల నుంచి ఈ ప్రక్రియపై కసరత్తు ప్రారంభించగా.. ఎట్టకేలకు నవంబర్ 28, 2022) 411ఎస్సై, 6100 కానిస్టేబుల్ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేశారు. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై స్థాయి, 6,100 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీచేశారు. సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్హతలు
‣ సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ ఉత్తీర్ణులై డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది.
‣ సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్ రెండేళ్లు చదివి ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి
‣ సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్లమధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1995 జులై 2 తర్వాత, 2001 జులై 1 కంటే ముందు జన్మించిన వారై ఉండాలి.
‣ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1998 జులై 2 తర్వాత, 2004 జులై 1 కంటే ముందు పుట్టినవారై ఉండాలి. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.
హోంగార్డులకు రిజర్వేషన్లు
‣ హోంగార్డులకు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్‌ను 8 నుంచి 15 శాతానికి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు 10 నుంచి 25 శాతానికి పెంచారు.
‣ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు రెండింటిలోనూ మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ
‣ ఆన్‌లైన్‌లో slprb.ap.gov.in లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
‣ సందేహాలు ఉంటే: ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి ఫోన్ నంబరు 9441450639కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్ చేయొచ్చు.
మూడు దశల్లో ఎంపిక
సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు
‣ ప్రాథమిక రాత పరీక్ష: 2 పేపర్లు...200 మార్కులకు. బహుళైౖచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
పేపర్-1: పదోతరగతి స్థాయిలో అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ
పేపర్-2: జనరల్ స్టడీస్ (డిగ్రీ స్థాయిలో)
దేహదారుఢ్య పరీక్షలు
‣ ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారినే దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికచేస్తారు.
‣ సివిల్ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగు నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలి. లాంగ్‌జంప్ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపికకు ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
‣ ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ మూడూ పూర్తిచేయాలి. 100 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
తుది రాత పరీక్ష
‣ మొత్తం పేపర్లు: 4 - మార్కులు: 600
‣ పేపర్-1: ఆంగ్లం (100 మార్కులకు)
‣ పేపర్-2 : తెలుగు లేదా ఉర్దూ (100 మార్కులకు)
‣ ఈ రెండు పేపర్లు వివరణాత్మక విధానం (డిస్క్రిప్టివ్)లో ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.
‣ పేపర్-3 : అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ (200 మార్కులకు)
‣ పేపర్-4 : జనరల్ స్టడీస్ (200 మార్కులకు)
‣ వీటిల్లో ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి.
‣ ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
‣ పేపర్-3, పేపర్-4లో 400 మార్కులకు అత్యధిక మార్కులు సాధించినవారిని సివిల్ ఎస్సై ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
‣ ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై పోస్టులకు పోటీపడేవారికి పేపర్-1, పేపర్-2 యథాతథంగా ఉంటాయి. పేపర్-3, పేపర్-4లను చెరో వందమార్కుల చొప్పున 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మార్కులకు దేహదారుఢ్య పరీక్షల్లో వచ్చిన మార్కులను కలపుతారు. అత్యధిక మార్కులు సాధించినవారిని ఉద్యోగానికి ఎంపికచేస్తారు.
సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ఇలా
మొదటి దశ:
ప్రాథమిక రాతపరీక్ష: ఒకటే పేపర్ 200 మార్కులకు (3 గంటల పాటు)
పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్ (పదోతరగతి స్థాయి), రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతచరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వర్తమాన అంశాలు.
రెండో దశ:
శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షలు: ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికే నిర్వహిస్తారు.
సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు తప్పనిసరిగా పూర్తిచేయాలి. లాంగ్‌జంప్ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపిక కోసం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ మూడూ పూర్తిచేయాలి. ఈ మూడు విభాగాల్లో ప్రదర్శించిన ప్రతిభకు మార్కులు కేటాయిస్తారు. వీటిని తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
మూడో దశ:
తుది రాతపరీక్ష: శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షల్లో ఎంపికైనవారికి తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 200 మార్కులకు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్ (పదోతరగతి స్థాయి), రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతచరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు.
సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు తుది ఎంపిక: తుది రాతపరీక్షలో 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు తుది ఎంపిక: చెరో వందమార్కులకు నిర్వహించే దేహదారుఢ్య, తుది రాతపరీక్షల్లో కలిపి మొత్తం 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
పోస్టుల వివరాలిలా..
సివిల్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు (మెన్ అండ్ ఉమెన్) - 315 ఏపీఎస్పీ రిజర్వ్ ఎస్సై పోస్టులు - 96 మొత్తం ఎస్సై పోస్టుల సంఖ్య - 411 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు(మెన్ అండ్ ఉమెన్) - 3580 ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు - 2520 మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పైన పేర్కొన్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల్లో మహిళలకు 33.33 శాతం పోస్టులను కేవలం సివిల్ విభాగంలో కేటాయించారు. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించనుంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 6511
కానిస్టేబుల్ పోస్టులు: 6100
1. 3,580 కానిస్టేబుల్ (సివిల్).
2. 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు.
యూనిట్ వారీగా సివిల్ ఖాళీల వివరాలు:
1. శ్రీకాకుళం-100
2. విజయనగరం-134
3. విశాఖపట్నం సిటీ-187
4. విశాఖపట్నం రూరల్-159
5. తూర్పు గోదావరి-298
6. రాజమహేంద్రవరం అర్బన్-83
7. పశ్చిమ గోదావరి-204
8. కృష్ణ-150
9. విజయవాడ సిటీ-250
10. గుంటూరు రూరల్-300
11. గుంటూరు అర్బన్-80
12. ప్రకాశం-205
13. నెల్లూరు-160
14. కర్నూలు-285
15. వై.ఎస్.ఆర్. కడప-325
16. అనంతపురం-310
17. చిత్తూరు-240
18. తిరుపతి అర్బన్-110
బెటాలియన్ వారీగా ఏపీఎస్సీ కానిస్టేబుల్ వివరాలు:
1. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల-630
2. రాజమహేంద్రవరం-630
3. ప్రకాశం జిల్లా మద్దిపాడు-630
4. చిత్తూరు-630
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: కనీసం 18 నుంచి 32 ఏళ్లు వయసు ఉండాలి.
* ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ప్రిలిమినరీ టెస్ట్‌లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఇస్తారు. అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్‌ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/ లాంగ్‌జంప్ ఈవెంట్లు ఉంటాయి.
* ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్‌జంప్ ఈవెంట్లు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
1. కానిస్టేబుల్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.11.2022
2. కానిస్టేబుల్ దరఖాస్తు చివరి తేది: 28.12.2022
3. ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్: 09.01.2023.
4. ప్రిలిమినరీ పరీక్ష తేది: 22.01.2023
ఎస్సై పోస్టులు: 411
1. 315 ఎస్‌ఐ సివిల్ పోస్టులు.
2. 96 రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్.
జోన్‌ల వారీగా సివిల్ ఎస్సై ఖాళీల వివరాలు:
1. జోన్ -I (విశాఖపట్నం రేంజ్) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం-50
2. జోన్ - II (ఏలూరు రేంజ్) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ-105
3. జోన్ - III (గుంటూరు రేంజ్) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు-55
4. జోన్ - IV (కర్నూలు రేంజ్) చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప-105
బెటాలియన్ వారీగా రిజర్వ్ ఎస్సై ఖాళీల వివరాలు:
1. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల-24
2. రాజమహేంద్రవరం-24
3. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు-24
4. చిత్తూరు-24
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ప్రిలిమినరీ టెస్ట్‌లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఇస్తారు. అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్‌ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో భాగంగా సివిల్ ఎస్సై అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/ లాంగ్‌జంప్ ఈవెంట్లు ఉంటాయి.
* ఏపీఎస్‌సీ రిజర్వ్ ఎస్సై అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్‌జంప్ ఈవెంట్లు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
1. ఎస్సై దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2022
2. ఎస్సై దరఖాస్తు చివరి తేది: 18.01.2023
3. ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్: 05.02.2023.
4. ప్రిలిమినరీ పరీక్ష తేది: 19.02.2023
హాల్ టికెట్స్ డౌన్ లోడ్ తేదీలు..
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్స్ విడుదల తేదీ - ఫిబ్రవరి 02, 2023
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్స్ విడుదల తేదీ - జనవరి 09, 2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు..
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష - ఫిబ్రవరి 19, 2023 (పేపర్ 1 ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు.. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ) ఎస్సై పరీక్ష మొదటి పేపర్ లో రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ లో జనరల్ స్టడీస్ పేపర్ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. కానిస్టేబుల్
జనవరి 22, 2023 శారీరక సామర్థ్య పరీక్షలు.. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు దేహదారుడ్య పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనిలో.. సివిల్ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీటర్ల రన్నింగ్, 100 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. ఇవి కేవలం అర్హత కోసం మాత్రమే. వీటిలో ఎలాంటి మెరిట్ ఉండదు. ఇక ఏపీఎస్పీ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీ, 100 మీ, లాంగ్ జంప్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. వీటిలో మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉండనుంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్, బీసీ అభ్యర్థులు 300 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు ఏర్పడినా.. సందేహాలు ఉన్నా.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు 9441450639 నంబర్ ను సంప్రదించవచ్చు.
Complete Notification Here
Website Here
Download Results for SI Click Here
Thanks for reading AP Constable, SI Recruitment 2022 Notification, Appy Online
No comments:
Post a Comment