Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 29, 2022

Transfer of IAS officers in AP


 

ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ


రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈ నెల 30న పదవీవిరమణ చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధానకార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్‌ వరకు ఆయనకు సర్వీసు ఉంది. అంటే మరో ఏడాదిన్నరపాటు ఆయన సీఎస్‌ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. సీఎస్‌గా పదవీవిరమణ అనంతరం సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. దాంతో పాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌, ఎక్స్‌లెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ఐఎల్‌ఈ అండ్‌ జీ) వైస్‌ఛైర్మన్‌ పోస్టులోనూ ఆయనను ఇన్‌ఛార్జిగా నియమించనున్నట్టు సమాచారం.

కొత్త సీఎస్‌గా నియమితులైన జవహర్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ప్రస్తుతం సీఎంఓ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి.

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ..

ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం స్పెషల్‌ సీఎస్‌గా పూనం మాలకొండయ్య నియమితులయ్యారు. వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌గా మధుసూదన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాష్‌, ఆర్‌అండ్‌బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్‌ పాండే, హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రటరీగా మహమ్మద్‌ దివాన్‌ను నియమించారు.బుడితి రాజశేఖర్‌ సెలవు నుంచి తిరిగొచ్చాక జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Thanks for reading Transfer of IAS officers in AP

No comments:

Post a Comment