Railway : రైల్వేలో భారీ జాబ్ రిక్రూట్‌మెంట్.. 35,000 ఉద్యోగాలు భర్తీ.. పూర్తి వివరాలివే
Indian Railway Jobs Over 35000 jobs :రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేలో 35,000 ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మొత్తం 35,281 పోస్ట్ లను భారతీయ రైల్వే భర్తీ చేయనుంది. అంతేకాదు.. ఈసారి ఖాళీల భర్తీలో ఎలాంటి జాప్యం లేకుండా మార్చి 2023 చివరి నాటికి దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
"మార్చి023 నాటికి, మొత్తం 35,281 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని, ఈ నియామకాలన్నీ CEN (సెంట్రలైడ్జ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్) 2019 ఆధారంగా ఉంటాయి" అని ఇండియన్ రైల్వేలో ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ తెలిపారు
వేర్వేరుగా ఫలితాలు.. ఎందుకంటే..?
వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలకు వేర్వేరుగా ఫలితాలను ప్రకటించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని అమితాబ్ శర్మ తెలిపారు. అన్నింటికీ కలిపి ఒకే పరీక్ష, ఒకే ఫలితం ప్రకటించడం వల్ల, కొందరు అభ్యర్థులు అన్ని ఉద్యోగాలకు క్వాలిఫై అవుతారని, చివరకు వారు ఏదో ఒక ఉద్యోగాన్నే నిర్ణయించుకుంటారు కనుక మిగతా ఉద్యోగాలు మళ్లీ ఖాళీగానే ఉంటాయని, అందువల్ల ఇతర అభ్యర్థులకు ఆ పోస్ట్ లు పొందే అవకాశం పోతుందని వివరించారు. వేరువేరుగా ఫలితాలను ప్రకటించడం వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుందని, ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు మొత్తం 32,281 ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
Thanks for reading Indian Railway Jobs Over 35000 jobs
No comments:
Post a Comment