T20 WC 2022 Winner Prize Money: ఛాంపియన్ ఇంగ్లండ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? భారత్‌కు మరి!
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్‌గా ఇంగ్లండ్ నిలిచింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండో సారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు.
తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన స్టోక్స్.. అనంతరం బ్యాటింగ్‌లో 52 పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అదే విధంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ కూడా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు గాను కర్రాన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఇక విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు ఎంత ఫ్రైజ్ మనీ దక్కిందో? రన్నరప్ పాకిస్తాన్ జట్టుకు ఎంత ఫ్రైజ్ మనీ లభించిందో ఇటువంటి సక్తికర విషయాలు తెలుసుకుందాం.
విజేతకు ఎంతంటే?
టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్‌కు ఫ్రైజ్ మనీ రూపంలో 1.6 మిలియన్ డాలర్లు((భారత కరెన్సీ ప్రకారం సుమారు 13 కోట్ల రూపాయలు) లభించింది. అదే విధంగా అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు 8,00,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 6.5 కోట్లు) దక్కింది.
ఇక సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైన భారత్, న్యూజిలాండ్‌కు 4,00,000 డాలర్ల ( సుమారు రూ.3.25 కోట్లు) చొప్పున అందింది. అదే విధంగా సూపర్ 12 దశ నుంచి వైదొలిగిన 8 జట్లకు 70,000 డాలర్ల చొప్పున లభించింది.
Thanks for reading T20 WC 2022 Winner Prize Money
No comments:
Post a Comment