ఓ రెండు నిమిషాలు లేచి నడవండి!
కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. మధ్యమధ్యలో లేచి ఓ ఐదూ పది నిమిషాలు నడవాలి అన్నది తెలిసిందే. అయితే టొరంటో యూనివర్సిటీ నిపుణులు చేసిన తాజా పరిశీలనలో మరో విషయం స్పష్టమైంది.
కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. మధ్యమధ్యలో లేచి ఓ ఐదూ పది నిమిషాలు నడవాలి అన్నది తెలిసిందే. అయితే టొరంటో యూనివర్సిటీ నిపుణులు చేసిన తాజా పరిశీలనలో మరో విషయం స్పష్టమైంది. ప్రతి అరగంటకీ ఓ రెండు నిమిషాలు లేచి నడవడంవల్ల కండరాలు శక్తిమంతంగా మారతాయట. కండర నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లను మనం తిన్న ఆహారం నుంచే తయారుచేసుకునే శక్తి వ్యాయామం వల్లే చేకూరుతుంది. అదే కదలకుండా కూర్చోవడం వల్ల- ప్రొటీన్ సంశ్లేషణ జరగకుండా- తిన్న ఆహారంలో అధికభాగం గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తుంది. పైగా శరీరం ఆహారంలోని ప్రొటీన్లను ఉపయోగించుకోలేక పోవడంతో కండరాలు బలహీనమవుతాయి. అప్పుడు ఆహారంలో ఎన్ని రకాల ప్రొటీన్లు తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని పన్నెండు మందిని ఏడు గంటలపాటు కదలకుండా కూర్చోబెట్టి, మరికొందరిని ప్రతి అరగంటకీ లేచి నడిచేలా చేసి మరీ తెలుసుకున్నారు. సో, మధ్య మధ్యలో ఓ రెండు నిమిషాల లేచి నడవడం అనేది కండరాల సామర్థ్యానికి ఎంతో మేలు.
Thanks for reading Health:Get up and walk for two minutes!
No comments:
Post a Comment