Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 13, 2022

WhatsApp: Auto mute if more than 256.. WhatsApp with same number on both phones!


 WhatsApp: 256కి మించితే ఆటో మ్యూట్‌.. రెండు ఫోన్లలో ఒకే నెంబర్‌తో వాట్సాప్‌!

విసుగుపుట్టించే గ్రూపు నోటిఫికేషన్ల సమస్యకు పరిష్కారంగా వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఫీచర్‌తోపాటు ఒకే నెంబర్‌తో రెండు వేర్వేరు ఫోన్లలో వాట్సాప్ సేవలు పొందేందుకు వీలుగా మరో ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది.

 వాట్సాప్‌లో ఎవరైనా గ్రూపు కట్టొచ్చు, టెక్ట్స్‌ మెసేజ్‌ల నుంచి 2 జీబీ మీడియా ఫైల్స్‌ వరకు షేర్‌ చేసుకోవచ్చు. అంతేనా.. నగదు చెల్లింపులు, ఆడియో/వీడియో కాల్స్‌, కమ్యూనిటీస్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా మరో ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేయనుంది. ఒకటికంటే ఎక్కువ గ్రూపులలో సభ్యులుగా ఉన్నవారికి తరచుగా వచ్చే నోటిఫికేషన్లు విసుగుపుట్టిస్తుంటాయి. కొన్నిసార్లు గ్రూపు నోటిఫికేషన్లను మ్యూట్ చేస్తే, మరికొన్ని సందర్భాల్లో మరిచిపోతుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది.

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌తో 256 మంది కంటే ఎక్కువమంది సభ్యులుగా ఉన్న గ్రూపు నోటిఫికేషన్లు ఆటోమేటిగ్గా మ్యూట్‌ అవుతాయి. ఉదాహరణకు మీరు సభ్యులుగా ఉన్న గ్రూపులో ఇప్పటిదాకా 256 మంది ఉన్నారు. ఈ గ్రూపులో ఇతరులు షేర్‌ చేసే మెసేజ్‌లు ఎప్పటిలానే మీకు నోటిఫికేషన్‌ స్క్రీన్‌లో కనిపిస్తాయి. కొత్తగా 257వ వ్యక్తి చేరితే, గ్రూపులో ఇతరులు షేర్‌ చేసే మెసేజ్‌లు మీకు నోటిఫికేషన్‌ స్క్రీన్‌లో కనిపించవు. వాట్సాప్‌ చాట్‌ పేజీలో ఈ గ్రూపు నోటిఫికేషన్లు మ్యూట్‌ అయినట్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. యూజర్‌ అన్‌మ్యూట్‌ చేస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌  2.22.24.15 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నారు.  కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ గ్రూపు సభ్యుల సంఖ్యను 256 నుంచి 1024కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్‌ కంపానియన్‌ మోడ్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా  తీసుకొస్తుంది. యూజర్లు తమ వాట్సాప్‌ ఖాతాతో నాలుగు డివైజ్‌లలో లాగిన్‌ కావచ్చు. వీటిలో రెండు మొబైల్‌ ఫోన్లలో లాగిన్ చేసేందుకు అనుమతి ఉంది. దీంతో ఒకేసారి వేర్వేరు ఫోన్లలో ఒకే నెంబర్‌తో వాట్సాప్‌ సేవలు పొందొచ్చు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతోపాటు కొత్తగా కమ్యూనిటీస్‌ అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు వేర్వేరు గ్రూపులను ఒకే వేదికపైకి తీసుకురావచ్చు. గరిష్ఠంగా ఒక కమ్యూనిటీస్‌లో 50 గ్రూపులను యాడ్ చేయొచ్చు. 5,000 మంది సభ్యులుగా ఉండొచ్చు.

Thanks for reading WhatsApp: Auto mute if more than 256.. WhatsApp with same number on both phones!

No comments:

Post a Comment