AP Cabinet Decisions : ఏపీలో పెన్షన్ల పెంపు.టీచర్ల బదులు సచివాలయ ఉద్యోగులు
AP Cabinet Decisions ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ లబ్దిదారులకు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంచనున్నారు. రాష్ట్రంలో పెన్షన్ దారులకు ఇచ్చే పెన్షన్ రూ.2750కు చేరనుంది.
పెన్షన్ మొత్తం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల రూ.130 కోట్లు అదనంగా ఖర్చు కానుందని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. పెన్షన్ చెల్లింపుల కోసం ప్రతినెల 1720 కోట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు. కొత్తగా చేర్చిన వారితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 64.74లక్షల మందికి ప్రతినెల రూ.2750 చొప్పున పెన్షన్ చెల్లించనున్నారు.
పెన్షన్ చెల్లింపుల కోసం ఇకపై ఏపీలో ప్రతినెల నెలకు రూ. 1786కోట్లు ఖర్చు కానుంది. గత ప్రభుత్వంలో నెలకు రూ.400కోట్లు మాత్రమే పెన్షన్లుగా చెల్లించేవారని మంత్రి చెప్పారు. రూ.400కోట్ల నుంచి రూ.1786కోట్ల రుపాయలకు చెల్లింపులు పెరగనున్నాయని, ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
సంక్షేమ పాలనలో భాగంగా ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాన్ని పొందలేకపోతే వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సోషల్ ఆడిట్ ద్వారా నవరత్నాలను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్తగా 2.63 లక్షల మందికి పెన్షన్లను అందించనున్నారు. ఇందుకోసం అదనంగా 403కోట్ల రుపాయల విలువైన పథకాలను డిసెంబర్ 27న లబ్దిదారులకు అందచేయనున్నారు.
కొత్తగా 2.63లక్షల పెన్షన్లు, 44,543 రేషన్ కార్డులు, 14,441 ఆరోగ్య శ్రీ కార్డులు, 14,531 ఇళ్ళ పట్టాలు, 65 కోట్ల పంట నష్టం భీమా సొమ్మును డిసెంబర్ 27న లబ్దిదారులకు అంద చేయనున్నారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందించాలని ప్రయత్నిస్తున్నామని మంత్రి చెల్లుబోయిన చెప్పారు.
డిసెంబర్ 21న విద్యార్ధులకు ట్యాబ్‌లు ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్ధులకు డిసెంబర్ 21న ట్యాబ్‌లను అందచేయనున్నారు . దీంతో పాటు పాఠశాలల్లో స్మార్ట్ టీవీల ఏర్పాటుకు రూ.50కోట్లు కేటాయించారు. 8వ తరగతి విద్యార్ధులకు "ఈ" కంటెంట్ అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని సిఎం జన్మదినం సందర్భంగా లాంఛనంగా ప్రారంభింస్తారు. రాష్ట్రంలోని 4.6లక్షల మంది 8వ తరగతి విద్యార్ధులతో పాటు 60వేల మంది టీచర్లకు శాంసంగ్ ట్యాబ్‌లను పంపిణీ చేస్తారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా ట్యాబ్‌లను సిద్ధం చేశారు. రూ.668కోట్ల విలువైన ట్యాబ్‌లను ప్రభుత్వం అందిస్తుండగా, బైజూస్ సంస్థ రూ.700కోట్ల విలువైన కంటెంట్‌ను వాటిలో పొందుపరచినట్లు మంత్రి తెలిపారు. మూడున్నరేళ్లలో విద్యార్దులకు అత్యంత విలువైన కంటెంట్ అందుతుందని మంత్రి తెలిపారు.
ఉపాధ్యాయుల స్థానంలో సచివాలయ ఉద్యోగులు...
ఏపీలో బోధనేతర పనులకు ఉపాధ్యాయులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఉపాధ్యాయులను బోధన పనులకు మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్న బోధనేతర పనుల కోసం 1.30వేల మంది సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని రాష్ట్ర క్యాబినెట్‌లో నిర్ణయించారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారని మంత్రి తెలిపారు.
మరికొన్ని క్యాబినెట్ నిర్ణయాలు..
ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు తీర్మానాలకు మంత్రి వర్గ సభ్యులు అమోద ముద్ర వేశారు. ఉచిత పంటల భీమా పథకంలో భాగంగా, పిఎం ఫసల్ భీమా యోజనలో సవరణకు మంత్రి మండలి అమోదం తెలిపింది. నెల్లూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కాలేజీలో 52 టీచింగ్, 56 నాన్ టీచింగ్ మొత్తం 108పోస్టులు మంజూరు చేశారు. మేకపాటి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలకు క్యాబినెట్ అమోదం తెలిపింది. 2022 సంవత్సరంలో జూన్ 1న నీటిని విడుదల చేయడం ద్వారా లబ్ది చేకూరిందని, నీటి వినియోగ విధనానికి మంత్రి మండలి అమోదం తెలిపింది.
సంతగుడిపాడులో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కాలేజీలో 13 పోస్టుల భర్తీకి అనుమతించారు. నేషనల్ లైవ్ స్టాక్ పథకంలో భాగంగా వైఎస్సార్ పశు భీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు.ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో అత్యుత్తమ బోధన కోసం 3 ప్రొఫెసర్లు, 4 అసోసియేట్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు నిర్మాణాలకు క్యాబినెట్ అమోదం తెలిపింది.
16 మునిసిపాలిటీల్లో రూ.100కోట్ల పెట్టుబడితో ఆస్పత్రులు నెలకొల్పాలని నిర్ణయించారు. వీటిలో ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్సలు అందించడానికి ముందుకు వచ్చే వారికి భాగస్వామ్యం కల్పిస్తారు.ఆదోనీ, రాయచోటిలలో మైనార్టీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లను ఏర్పాటు చేయనున్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలిపింది. మెగా వాట్‌కు రెండు లక్షల ఆదాయం వచ్చేట్టు, రైతుల నుంచి భూమి తీసుకుంటే రైతుకు రూ30వేల చెల్లించేలా లీజు చేసుకోనున్నారు. ఏటా ఐదు శాతం లీజుపై పెంపుదలతో చెల్లింపులు ఉంటాయి.
ఈ విధానంలో 43వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఏర్పాటు చేయనున్నారు. అల్లూరి జిల్లాలో 1600మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు అదానీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలిపింది. మశిలలో 900 మెగావాట్ల ప్లాంట్‌కు అనుమతి క్యాబినెట్ అమోద ముద్ర తెలిపింది. లేరు వద్ద 1300మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌ను అప్పర్ సీలేరు ప్లాంట్ అనుమతినిచ్చారు. కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి మండలి అమోదం తెలిపింది. రాష్ట్రంలో రెండు మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలను కల్పించాలని క్యాబినెట్ అమోదం తెలిపింది. సమగ్ర భూ సర్వేలో భాగంగా మునిసిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1965లో సవరణకు క్యాబినెట్ అమోదం తెలిపింది. బాపట్ల కేంద్రంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ లో ఎస్‌ఇ పోస్టు మంజూరు చేశారు. నరసరావు పేట కేంద్రంగా పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు.
Thanks for reading AP Cabinet Decisions@13.12.22
No comments:
Post a Comment