Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్.. ‘చూడూ.. ఒకసారే చూడూ!’
WhatsApp view once messages feature: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. మెసేజ్‌ను సైతం ఇకపై ఒకసారే చూసేందుకు వీలయ్యేలా కొత్త సదుపాయం తీసుకొస్తోంది.
మనందరి నిత్య జీవితంలో భాగమైపోయిన వాట్సాప్ (Whatsapp).. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. వ్యక్తుల చాట్‌ను కొంత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేందుకు వీలుగా ఇప్పటికే ‘డిస్ అపియరింగ్’ పేరిట ఓ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో మరో ఫీచర్‌ను సైతం తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.
వాట్సాప్ తీసుకురాబోతున్న వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ (view once messages feature) ద్వారా ఎవరైనా పంపించిన సందేశాన్ని కేవలం ఒక్కసారి చూసేందుకు మాత్రమే వీలుంటుంది. ఒకసారి చూశాక అది కనిపించదు. అటు పంపించేవారికి, అందుకునే వారికి సైతం ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అంటే ఎవరైనా పంపిన మెసేజ్‌ను వేరొకరికి పంపించడానికి వీలుండందన్నమాట.
ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి వ్యూ వన్స్ ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. ఏదైనా ఫొటో/ వీడియోను ఒకసారి చూశాక మరోసారి చూడ్డానికి వీలుండదు. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవడం సైతం కుదరదు. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ ఫార్మాట్‌కు సైతం అప్లయ్ చేయాలని వాట్సాప్ చూస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెండ్ బటన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో ఎప్పుడు తీసుకొస్తారనేది మాత్రం తెలియరాలేదు.
Thanks for reading WhatsApp: Another feature in WhatsApp.. 'view once messages...
No comments:
Post a Comment