E-Luna: ఎలక్ట్రిక్ ‘లూనా’ వచ్చేస్తోంది.. త్వరలో విడుదల చేయనున్న కైనెటిక్!
ఒకప్పుడు భారత విపణిలో 95 శాతం వాటా కలిగిన లూనా మోపెడ్‌ను మళ్లీ తీసుకొస్తున్నట్లు కైనటిక్ ఎనర్జీ తెలిపింది. ఈసారి విద్యుత్తు వెర్షన్‌ను విడుదల చేస్తామని పేర్కొంది.
ఒకప్పుడు భారత్‌లో భారీ ఆదరణ పొందిన మోపెడ్ ‘లూనా (Luna)’ను తిరిగి తీసుకురానున్నట్లు ‘కైనెటిక్ గ్రూప్ (Kinetic Group)’ వెల్లడించింది. ఈసారి విద్యుత్తు వెర్షన్‌ను విడుదల చేస్తామని సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. తమ అనుబంధ సంస్థ అయిన ‘కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్’ ఈ ‘ఇ-లూనా (E-Luna)’ను తీసుకురానున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ‘కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (KEL)’ లూనాకు సంబంధించిన ఛాసిస్ సహా ఇతర విడిభాగాల తయారీని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. మెయిన్ స్టాండ్, సైడ్ స్టాండ్, స్వింగ్ ఆర్మ్ భాగాలను సైతం తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. తొలుత నెలకు 5,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రత్యేకంగా అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వచ్చే 2- 3 ఏళ్లలో లూనా విక్రయాల ద్వారా అదనంగా రూ.30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేఈఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అంజిక్య ఫిరోడియా అంచనా వేశారు. ఒకప్పుడు రోజుకు 2000 లూనా యూనిట్లు అమ్ముడయ్యేవని.. కొత్త వెర్షన్ కూడా ఆ స్థాయిని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దాదాపు 50 ఏళ్ల క్రితం తాము లూనాను తొలిసారి విడుదల చేశామని కేఈఎల్ గుర్తుచేసింది. రూ.2,000 ప్రారంభ ధరతో వచ్చిన ఈ వాహనం తదనంతర కాలంలో భారత్‌లో అత్యంత ఆదరణ పొందిందని తెలిపింది. ఓ దశలో ఈ కేటగిరీలో 95 శాతం మార్కెట్ వాటా లూనాదేనని పేర్కొంది. ఇ-లూనాకు సంబంధించిన అన్ని విడిభాగాలు పెయింటింగ్‌తో సహా అహ్మదాబాద్‌లోని ప్లాంట్‌లోనే తయారవుతాయని తెలిపింది. రూ.మూడు కోట్లతో ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొంది.
Thanks for reading E-Luna: Electric 'Luna' is coming... Kinetic to be released soon!
No comments:
Post a Comment