UPSC CDSE Recruitment 2023 Notification
ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్సుల్లో లక్షణమైన ఉన్నతోద్యోగాలెన్నో ఉన్నాయి. ఉమ్మడి పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో అవకాశం పొందవచ్ఛు. UPSC నిర్వహిస్తోన్న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDSE) వీటికి దారిచూపుతుంది.
UPSC - కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2023
మొత్తం ఖాళీలు: 341
విద్యార్హత: మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. ఏయిర్‌ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీలకు జనవరి 2, 2000 కంటే ముందు; జనవరి 1, 2005 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఏయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 2000 కంటే ముందు, జనవరి 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1999 కంటే ముందు, జనవరి 1, 2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.
ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెల్లిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 21, 2022
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: జనవరి 10, 2023
పరీక్ష తేదీ: 2023, ఏప్రిల్ 16.
Thanks for reading UPSC CDSE Recruitment 2023 Notification
No comments:
Post a Comment