Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 23, 2022

Jio prepaid plans


 Jio prepaid plans: జియో నుంచి న్యూఇయర్‌ ప్లాన్స్‌.. పూర్తి వివరాలు ఇవే!

Jio prepaid plans: రిలయన్స్‌ జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. కొత్తగా రూ.2023 ప్లాన్‌ను తీసుకురాగా.. ఇది వరకే ఉన్న రూ.2999 ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసింది. 

 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను (prepaid plans) తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్‌ 2023 పేరిట (Jio happy new year offer) ఈ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఇందులో ఒకటి రూ.2023 విలువతో తీసుకురాగా.. ఇప్పటికే ఉన్న రూ.2999 ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్లాన్‌, వ్యాలిడిటీ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రూ.2023 ప్లాన్‌

2023 సంవత్సరాన్ని తెలియజేసే విధంగా రూ.2023 విలువతో రిలయన్స్‌ జియో ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 252 రోజులు. ఈ ప్లాన్‌ కింద రోజుకు 2.5 జీబీ మొబైల్‌ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో జియో యాప్స్‌ ఉచితంగా లభిస్తాయి. 28 రోజుల బిల్లింగ్‌ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. 9 బిల్లింగ్‌ సైకిల్స్‌తో ఈ ప్లాన్‌ సమానం. అంటే నెలకు రూ.225 చొప్పున పడుతుంది. 

రూ.2999 ప్లాన్‌

జియో ఎప్పటి నుంచో ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందిస్తోంది. దీని కింద రోజుకు 2.5జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్‌ లభిస్తాయి. మొత్తం 365 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్‌లో కొత్తగా కొన్ని మార్పులు చేశారు. ఏడాది వ్యాలిడిటీకి అదనంగా మరో 23 రోజుల అదనపు వ్యాలిడిటీని, 75జీబీ డేటాను జోడించారు. రిలయన్స్‌ జియోకు చెందిన ‘మై జియో’ యాప్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌ వేదికల ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ కోసం చూస్తున్న వారు ఈ రెండు ప్లాన్లను పరిశీలించొచ్చు.

Thanks for reading Jio prepaid plans

No comments:

Post a Comment