Coronavirus: కొవిడ్ బీఎఫ్.7 ప్రాణాంతకం కాదు: ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి
బీఎఫ్.7 ఒక్కరి నుంచి 10మందికి వ్యాపిస్తుందని, భారత్‌లో వస్తున్న కొవిడ్ కేసులలో 80శాతం ఎక్స్ బీబీ రకానివేనని ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.
ఒమిక్రాన్‌కు చెందిన బీఎఫ్.7 సబ్ వేరియంట్ ఇప్పుడు మన దేశంలోకీ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్రాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఈ బీఎఫ్.7 వేరియంట్‌పై ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘‘చైనాలో వచ్చినంత ఎక్కువగా భారత్‌లో కొవిడ్ కొత్త కేసులు వచ్చే అవకాశం లేదు. చైనాలో ఇచ్చిన వ్యాక్సిన్‌లు తక్కువ నాణ్యత కలిగినవి. చైనా ఇటీవలి వరకు జీరో కొవిడ్ విధానాన్ని పాటించింది. ఇటీవలే అక్కడ కొవిడ్ నిబంధనలు సడలించారు. అందుకే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత్‌లో అక్టోబరులోనే ఈ బీఎఫ్.7 కేసులు వెలుగు చూశాయి.. కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. బీఎఫ్.7 ఒక్కరి నుంచి 10మందికి వ్యాపిస్తుంది. భారత్‌లో వస్తున్న కొవిడ్ కేసులలో 80శాతం ఎక్స్ బీబీ రకానివే. బూస్టర్ డోస్‌గా ఒకే రకం వ్యాక్సిన్‌కి బదులుగా భిన్నమైన వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. కొవిడ్ బీఎఫ్.7 ప్రాణాంతకం కాదు. వచ్చే మూడేళ్ల వరకు ఏటా బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిది’’ అని నాగేశ్వర్‌రెడ్డి వివరించారు.
Thanks for reading Coronavirus: Covid BF7 is not fatal: AIG Chairman Nageshwar Reddy
No comments:
Post a Comment