Loans: వ్యక్తిగత రుణాల లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవీ..
బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోరు కలిగిన వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వ్యక్తిగత రుణాలను (Personal Loan) అందిస్తున్నాయి.
పెళ్లి, ప్రయాణాలు, విద్య, అనారోగ్య కారణాలు, పాత అప్పులు తీర్చడానికి, ఏవైనా ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఈ వ్యక్తిగత రుణాలు చాలా మందికి అవసరమే. తక్షణ ఆర్థిక అవసరాలు తీరడానికి ఈ రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ రోజుల్లో వ్యక్తిగత రుణానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ ఖాతా ఉన్న సమీప బ్యాంకు శాఖను కూడా సంప్రదించొచ్చు. వ్యక్తిగత రుణాల కాలవ్యవధి 12 నెలల నుంచి 84 నెలల వరకు ఉంటుంది. కాలవ్యవధి పెరిగేకొద్దీ వడ్డీ మొత్తం కూడా అధికంగానే చెల్లించవలసి ఉంటుందని రుణ గ్రహీతలు గ్రహించాలి.
రూ. 3 లక్షల రుణంపై (5 సంవత్సరాల కాలవ్యవధికి) ఈఎంఐ ఎంత చెల్లించాలో ఈ కింది పట్టికలో ఉంది.
గమనిక:ఈ పట్టికలో తెలిపిన వడ్డీ రేట్లు బ్యాంకులు వసూలుచేసే అత్యల్ప రేట్లు మాత్రమే. ఆయా వ్యక్తుల క్రెడిట్ స్కోరు, చేసే వృత్తి, బ్యాంకుల నియమ నిబంధనలను బట్టి వడ్డీ రేటు మారొచ్చు. ఇందులో తెలిపిన రుణ మొత్తం సూచిక మాత్రమే. అర్హతను బట్టి రుణ మొత్తాన్ని మార్చుకోవచ్చు. రుణ ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఖర్చులు ఈఎంఐలో కలపలేదు.
Thanks for reading Loans: These are the latest interest rates for personal loans.
No comments:
Post a Comment