కొత్త ఏడాది నుండి కొత్త నిబంధనలు
కొత్త నెల వచ్చిందంటే చాలు అనేక కొత్త నిబంధనలు , రూల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా గ్యాస్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు కొత్త ఏడాది రాబోతుంది.
దీంతో ఇంకెన్ని కొత్త రూల్స్ , నిబంధనలు వస్తాయో అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు..కొత్త ఏడాది నుండి అనేక మార్పులు , రూల్స్ వచ్చి పడబోతున్నట్లు తెలుస్తుంది.
పెట్రోల్, డీజిల్ ధరలలో జనవరి 1 నుంచి మార్పులు రాబోతున్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి.
హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు ని జనవరి ఒకటి నుండి అందుబాటులోకి తీసుకరాబోతున్నారు. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌లు ఉంటే ఏ ఇబ్బంది రాదని , చేయించుకోకపోతే ఇబ్బందులు వస్తాయని , హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకపోతే రూ.5వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని అంటున్నారు.
జనవరి 1 నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం సైతం మరింత పెరగనుంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఈ-ఇన్‌వాయిసింగ్ తప్పకుండా జనరేట్ చేసుకోవాలి.
జనవరి 6, 2023 నుంచి ఎస్‌బీఐ సింప్లి క్లిక్ క్రెడిట్ కార్డు యూజర్లకు జారీ చేసే క్లియర్ ట్రిప్ వోచర్ ని ఎక్కువ సార్లు రీడిమ్ చేసుకునే వీలు లేకుండా కేవలం ఒక్కసారి మాత్రమే రిడీమ్ చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది. పైగా ఈ వోచర్ ఏ ఇతర వోచర్ల తోనూ, ఆఫర్లతోనూ కలిపి రాదు. జనవరి 01, 2023 నుంచి అమెజాన్ వెబ్ సైట్ లో ఈ కార్డు ని వాడితే వచ్చే రివార్డు పాయింట్లను తగ్గించేసింది.
ఇక గ్యాస్ ధరల విషయంలో కూడా మార్పులు జరగబోతున్నట్లు సమాచారం.
Thanks for reading New rules from the new year


No comments:
Post a Comment