Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 2, 2022

Term Insurance: The premium is returned in this term insurance!


 Term Insurance: ఈ టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం తిరిగిచ్చేస్తారు!

Term Insurance: సాధారణంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అంటే ప్రీమియం తిరిగి రాదు. కానీ, జీరో-కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో మాత్రం పాలసీని ముందే సరెండర్‌ చేస్తే ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. 

 కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత భారత్‌లో బీమాపై అవగాహన పెరిగింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించి ఆర్థిక ప్రణాళికలో భాగం చేసుకుంటున్నారు. దీంతో జీవిత బీమా పథకాలకు గిరాకీ పుంజుకుంటోంది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీమా సంస్థలు సరికొత్త పథకాలతో ముందుకొస్తున్నాయి. అందులో భాగంగా వచ్చిందే ‘జీరో-కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌’. అంటే ఖర్చు లేకుండానే బీమా హామీని పొందడం.

బీమా రంగంలో ఓ విప్లవం..

అవధి బీమా (term insurance) తీసుకోవాలా.. వద్దా.. అనే నిర్ణయం తీసుకోవడంలో ప్రీమియం కీలక పాత్ర పోషిస్తుంది. అధికంగా ఉంటే కస్టమర్లు వెనకడుగు వేస్తుంటారు. అలాగే బాధ్యతలన్నీ తీరిన తర్వాత టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఉపయోగం ఏంటి అని కూడా వినియోగదారులు ఆలోచిస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే జీరో-కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకొచ్చారు. దీంట్లో పాలసీదారుడు తన పాలసీని సరెండర్‌ చేయడానికి ఒకసారి అవకాశం ఇస్తారు. అలా చేసినవారికి జీఎస్టీని తీసివేసి అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగిచ్చేస్తారు.

ఆ సంశయానికి సమాధానమే..

పాలసీ వ్యవధిలో తమకు ఏమీ జరగకపోతే అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తం తిరిగిరాదని చాలా మంది టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి వెనకాడుతుంటారు. దీంతో దాని ప్రాధాన్యాన్ని గుర్తించేలోపే సమయం గడిచిపోతుంది. ప్రీమియం పెరిగిపోతుంది. అలాంటప్పుడు జీరో-కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ చాలా ఉపయోగపడుతుంది. యాక్టివ్‌గా పనిచేస్తున్నంత కాలం పాలసీదారుడికీ, వారి కుటుంబానికీ రక్షణగా ఉంటుంది. రిటైర్‌ అయ్యే వరకు పాలసీని క్లెయిం చేసుకోవాల్సిన అవసరం లేకపోతే సరెండర్‌ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. తద్వారా అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తం తిరిగొచ్చేస్తుంది. అయితే, అప్పటికీ మీపై ఎలాంటి ఆర్థిక బాధ్యతలు ఉండొద్దు. కాబట్టి పాలసీని సరెండర్‌ చేయాలా.. లేదా.. అనేది పూర్తిగా మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలు, లక్ష్యాలను బట్టే నిర్ణయించుకోవాలి. వయసు 45 ఏళ్లలోపు ఉన్నవారే ఈ పాలసీని తీసుకునేందుకు అర్హులు. 

టీఆర్‌ఓపీ, జీరోకాస్ట్‌ అవధి బీమాకు వ్యత్యాసం ఇదే..

చాలా మంది జీరో-కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లకు, ‘టర్మ్‌ రిటర్న్‌-ఆఫ్‌-ప్రీమియం (TROP)’ ప్లాన్లకు మధ్య ఉన్న తేడాను గుర్తించలేకపోతుంటారు. రెండూ ఒకే తరహా అనుకొని పొరపడుతుంటారు.

☛ టర్మ్‌ ప్లాన్లలో ఒకవేళ పాలసీదారులు పాలసీ వ్యవధిలో మరణిస్తే.. నామినీకి హామీ మొత్తం లభిస్తుంది. ఒకవేళ గడువు తీరే వరకు జీవించి ఉంటే ఎలాంటి సొమ్ము తిరిగి రాదు.

☛ టీఆర్‌ఓపీలో కూడా పాలసీదారుడు మధ్యలో మరణిస్తే నామినీకి బీమా మొత్తం అందజేస్తారు. పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత అప్పటి వరకు చెల్లించిన అన్ని ప్రీమియంల మొత్తంతో పాటు కొంత అదనంగా  తిరిగిచ్చేస్తారు. అయితే, ప్రీమియం మాత్రం టర్మ్‌ ప్లాన్లతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంటుంది.

☛ జీరో-కాస్ట్‌ టర్మ్‌ బీమాలో సైతం పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తం నామినీకి ఇస్తారు. అయితే, వీటిలో కూడా టర్మ్‌ పాలసీల తరహాలోనే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా పాలసీ కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడకుండా మధ్యలోనే నిష్క్రమించే వెసులుబాటు ఉంటుంది. అలా చేస్తే ముందు చెప్పినట్లుగా ప్రీమియం మొత్తాన్ని కూడా తిరిగిచ్చేస్తారు.

జీవనశైలి వ్యాధులు పెరుగుతుండడం, ఆర్థిక అస్థిర పరిస్థితుల వంటి పరిణామాల నేపథ్యంలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అత్యవసరమై పోతోంది. ఈ క్రమంలో భారత్‌లో బీమా రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. బీమాను సామాన్యులకు చేర్చడంలో జీరో-కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వంటి వినూత్న పథకాలు దోహదం చేస్తున్నాయని నిపుణులు తెలిపారు.

Thanks for reading Term Insurance: The premium is returned in this term insurance!

No comments:

Post a Comment