UGC NET2022: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
యూజీసీ- నెట్ 2022 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21 నుంచి పరీక్షలు జరగనుండగా.. ఈరోజు నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోచ్చని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10వరకు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ ఎం. జగదీశ్‌కుమార్ వెల్లడించారు. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలి(NTA)కి అప్పగించినట్టు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు డిసెంబర్ 29 నుంచి(నేటి నుంచి) జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10వరకు జరగనుందని తెలిపారు. అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.
Thanks for reading UGC NET2022: UGC NET Exam Schedule Released
No comments:
Post a Comment