ICMR: 12 ఆరోగ్య చిట్కాలతో ఐసీఎంఆర్ న్యూ ఇయర్ విషెష్.. అవేంటో చూశారా?
భారత వైద్య పరిశోధన మండలి(ICMR), జాతీయ పౌష్టికాహార సంస్థ (NIN) వినూత్నంగా కొత్త సంవత్సర వేడుకలు తెలిపాయి. కొత్త సంవత్సరానికి ఆరోగ్య చిట్కాలను సూచిస్తూ రూపొందించిన గ్రీటింగ్ కార్డు ఆకట్టుకుంటోంది.
2022కి వీడ్కోలు పలికి మరో కొత్త సంవత్సరానికి(Happy New Year 2023) ఘన స్వాగతం పలికాం. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ప్రతి ఒక్కరికీ శుభాలే కలగాలంటూ ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొంటున్నాం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఆరోగ్యమయ జీవితాన్ని కొనసాగించేలా 12 చిట్కాలతో ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్(ICMR-NIN) సంయుక్తంగా షేర్ చేసిన గ్రీటింగ్ ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం ప్రాముఖ్యతతో Happy new year శుభాకాంక్షలు చెబుతూ 12 అక్షరాలలో 12 ఆరోగ్య సూత్రాలు..
- ప్రతిరోజూ తగిన మోతాదులో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
- అధిక కొవ్వులు, చక్కెర, ఉప్పుతో ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
- రోజులో కనీసం 30 నిమిషాలైనా శారీరక శ్రమ చేసేలా ప్రాక్టీస్ చేయండి.
- పండ్ల రసాలకు బదులు తాజా పండ్లను తినండి. రిఫైన్డ్, పాలిష్ చేసిన ధాన్యాలకు బదులు తృణధాన్యాలు ఆరోగ్యానికి మంచివి.
- ప్రాసెస్ చేసిన ఫుడ్‌లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.
- నిద్రకు సంబంధించిన నాణ్యతలో గానీ, సమయంలో గానీ ఎట్టిపరిస్థితుల్లో రాజీపడొద్దు.
- రోజులో కచ్చితంగా 2-3లీటర్ల నీరు తాగండి.
- ఆహారం తీసుకొనే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోండి.
- ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. పొగాకు, మద్యం వాడకానికి దూరంగా ఉండండి.
- వైవిధ్యమైన డైట్ పాటించండి. అన్ని పోషకాలూ ఒకే ఆహారంలో లభించవని గుర్తుపెట్టుకోండి.
- ఆహార నియమాలకు కట్టుబడి ఉండండి.
- ఆహార పదార్థాలపై ఉన్న లేబుల్స్‌ను సరిగా చదవండి. మీరు తినాల్సిన ఆహారాన్ని తెలివిగా ఎంచుకోండి.
ICMR-NIN Family and @NINDirector Wish You All a Very Happy & Healthy New Year 2023@ICMRDELHI @DeptHealthRes @MoHFW_INDIA pic.twitter.com/kOjgncz5EP
— ICMR - National Institute of Nutrition (@ICMRNIN) December 31, 2022
Thanks for reading ICMR New Year wishes with 12 health tips.. Have you seen that?
No comments:
Post a Comment