ట్రాక్టర్ ఇంధనంగా పేడ!
పేడతో కళ్లాపి చల్లడం చాలామంది చేసేదే. పిడకలు తయారు చేసుకుని వంటకు ఉపయోగించుకోవడమూ అందరికీ తెలిసిందే.
పేడతో కళ్లాపి చల్లడం చాలామంది చేసేదే. పిడకలు తయారు చేసుకుని వంటకు ఉపయోగించుకోవడమూ అందరికీ తెలిసిందే. కానీ, పేడతో వాహనాలను నడిపిస్తారని ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్య బిన్నమన్ అనే బ్రిటీష్ కంపెనీ ఆవుపేడతో నడిచే ట్రాక్టర్‌ను తయారుచేసింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న కర్బన ఉద్గారాలను నియంత్రించగలిగేలా రూపొందించిన ఈ గ్రీన్ ట్రాక్టర్‌లో- ఆవుపేడను నేరుగా ఇంధన ట్యాంకులో వేస్తారు అనుకునేరు. ముందుగా పేడను ఓ ప్లాంట్‌లోకి పంపి.. అందులోంచి బయోమీథేన్ వాయువును ఓ ట్యాంకులోకి సేకరిస్తారు. మైనస్ 162 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర అది ద్రవంగా మారాక మరో ట్యాంకులో నిల్వ చేస్తారు. ఈ ట్యాంకును ట్రాక్టర్‌కే అమర్చుకుంటే నేరుగా ఇంధన ట్యాంకులోకి ఇంధనం సరఫరా అవుతుంది. అలానే ఆ ట్యాంకును వేరు చేసి కూడా ట్యాంకులో ఇంధనం నింపి ట్రాక్టర్‌ని నడపొచ్చు. పెట్రోలూ, డీజిల్‌కి ఉన్న శక్తి ఈ ఇంధనానికీ ఉంటుంది. కానీ, వాటి మాదిరిగా వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ అంతగా విడుదలవ్వదు. ‘పేడ ట్రాక్టర్’తో ఆ కాలుష్యం చాలా తగ్గుతుంది. ప్రయోగ పూర్వకంగానూ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఈ గ్రీన్ ట్రాక్టర్ ముందుంటుందని రుజువైంది. త్వరలో మార్కెట్‌లోకి రానున్న ఈ ట్రాక్టర్‌తో పాడి రైతులకు పేడ ఇంధనాన్ని అమ్మడం ద్వారా కొత్త ఆదాయ మార్గమూ అందుబాటులోకి వచ్చిందంటున్నారు నిపుణులు.
Thanks for reading This Tractor Runs Not On Diesel, But On Cow Dung. Yes, Farmers Can Create Their own Fuel
No comments:
Post a Comment