Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 21, 2023

LIC ADO Recruitment 2023: Apply for 9394 posts at licindia.in, details here


 LIC ADO Recruitment 2023: Apply for 9394 posts at licindia.in, details here

LIC ADO: ఎల్‌ఐసీలో 9394 ఏడీఓ ఉద్యోగాలు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా… దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భ‌ర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్‌ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ కార్యాలయాల్లో 1408 ఏడీఓ ఖాళీలున్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులతో పాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించి.. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

వివరాలు:

* అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 9394 పోస్టులు

జోన్ల వారీగా ఖాళీల వివరాలు…

సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్): 561

ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్‌కతా): 1049    

ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పట్నా): 669    

నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూదిల్లీ): 1216    

నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్): 1033    

సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై): 1516    

సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1408

వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి): 1942    

మొత్తం ఖాళీలు: 9394

* దక్షిణ మధ్య జోన్‌లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఖాళీలు: 1408.

డివిజన్ల వారీగా ఖాళీలు: కడప- 90, హైదరాబాద్- 91, కరీంనగర్- 42, మచిలీపట్నం- 112, నెల్లూరు- 95, రాజమహేంద్రవరం- 69, సికింద్రాబాద్- 94, విశాఖపట్నం- 57, వరంగల్- 62, బెంగళూరు-1- 115, బెంగళూరు-2- 117, బెల్గాం- 66, ధార్వాడ్- 72, మైసూర్- 108, రాయచూర్- 83, షిమోగా- 51, ఉడిపి- 84.

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్‌ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: ఏడీఓగా ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో నెలకు రూ.51,500 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తదనంతరం ప్రొబేషనరీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా నెలకు రూ.35650-రూ.90205 వేతనం ఉంటుంది. దీనికి ఇతర భత్యాలు అదనం.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ/ మెయిన్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానం: ప్రిలిమ్స్‌లో రీజనింగ్‌ ఎబిలిటీ, న్యూమెరికల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. మెయిన్స్‌లో రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ న్యూమెరికల్‌ ఎబిలిటీ, జీకే, కరెంట్‌ అఫైర్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌ అవేర్‌నెస్‌ తదితర సబ్జెక్టుల్లో 160 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750.(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100).

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 21-01-2023.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ:  10-02-2023.

ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ ప్రారంభం: 04-03-2023.    

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12-03-2023.

మెయిన్ పరీక్ష తేదీ: 08-04-2023.

Website Here

Notification Here

Thanks for reading LIC ADO Recruitment 2023: Apply for 9394 posts at licindia.in, details here

No comments:

Post a Comment