Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, February 25, 2023

APPSC: Group-2.. Group-3 Jobs in AP.. New Rules in Recruitment Process


 APPSC: ఏపీలో గ్రూప్‌-2.. గ్రూప్‌-3 ఉద్యోగాలు.. నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నిర్వహించే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వంద మార్కులకు సీపీటీ నిర్వహించనున్నట్లు పోలా భాస్కర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ)(APPSC) నిర్వహించే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో (Recruitment) పలు మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకానికి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్‌సీ, ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూపు-2, గ్రూపు-3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

వంద మార్కులకు గానూ సీపీటీ నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో SC, ST, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్లు, డిజిటల్‌ పరికరాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్ విండోస్‌, ఇంటర్నెట్‌ తదితర అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రూపు-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ ఉత్తర్వుల్లో  స్పష్టం చేశారు.

Thanks for reading APPSC: Group-2.. Group-3 Jobs in AP.. New Rules in Recruitment Process

No comments:

Post a Comment