Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, February 24, 2023

New Rules: New rules coming into effect in March 2023


 New Rules: మార్చిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్... మీ జేబుకు చిల్లు పెట్టేవి ఇవే

కొత్త నెల వచ్చినప్పుడల్లా కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రావడం మామూలే.

మార్చిలో కూడా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. వాటిలో మీ జేబుకు చిల్లుపెట్టే నియమనిబంధనలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit Card) కొత్త ఛార్జీలు, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు, బ్యాంకుల్లో వడ్డీ రేట్ల (Bank Interest Rates) పెంపు... ఇలా చాలావరకు నియమనిబంధనలు డబ్బుతో ముడిపడి ఉన్నవే. మరి మార్చిలో అమలులోకి రాబోతున్న కొత్త రూల్స్ ఏంటీ? వాటిలో మీపై ప్రభావం చూపించేవి ఏంటీ? మీ జేబుకు చిల్లు ఎలా పడుతుందో తెలుసుకోండి.

SBI Credit Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన క్రెడిట్ కార్డ్ విభాగం ఎస్‌బీఐ కార్డ్ కొత్త ఛార్జీలను ప్రకటించింది. కొత్త ఛార్జీలు 2023 మార్చి 17 నుంచి అమలులోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఎవరైనా అద్దె చెల్లిస్తే రూ.199 + ట్యాక్సులు చెల్లించాలి. గతంలో ఈ ఛార్జీలు రూ.99 మాత్రమే ఉండేవి.

EPFO Higher Pension: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ ఖాతాదారులు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇందుకోసం ఈపీఎఫ్ ఖాతాదారులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తమ దరఖాస్తుల్ని సబ్మిట్ చేయడానికి 2023 మార్చి 3 చివరి తేదీ.

Tirumala: తిరుమలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేయనుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని సర్వదర్శనం కౌంటర్, టోకెన్‌లెస్ దర్శనం, లడ్డూల పంపిణీ, వసతి అలాట్‌మెంట్, కాషన్ డిపాజిట్ రీఫండ్, ఇతర ప్రాంతాల్లో ఉపయోగించనుంది టీటీడీ.

LPG Gas Cylinder Price: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. లేదా స్థిరంగా ఉండొచ్చు. మరి ఈసారి ఆయిల్ కంపెనీలు ఏ నిర్ణయం తీసుకుంటాయో మర్చి 1న తెలుస్తుంది.

Indian Railways: భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్‌ను మార్చే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రైళ్ల టైమింగ్స్‌ను మార్చవచ్చన్నది ఆ వార్తల సారాంశం. కొత్త టైమ్ టేబుల్ మార్చిలో రిలీజ్ కానుంది.

Bank Loans: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్ 25 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే తమ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెంచుతున్నట్టు ప్రధాన బ్యాంకులు ప్రకటించింది. మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. దీంతో సామాన్యులకు రుణాలు భారం కానున్నాయి.

Social Media: అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు మూడు కంప్లైంట్ అప్పీలేట్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మార్చి 1 నుంచి ఈ కమిటీలు పనిచేస్తాయి. సోషల్ మీడియాపై వచ్చే ఫిర్యాదుల్ని కేవలం 30 రోజుల్లో పరిష్కరిస్తాయి ఈ కమిటీలు.

Thanks for reading New Rules: New rules coming into effect in March 2023

No comments:

Post a Comment