Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 16, 2023

AP Budget - 2023 key points


 AP Budget: ఏపీ బడ్జెట్‌ రూ.2.79 లక్షల కోట్లు.. ముఖ్యాంశాలివే!

ఏపీ రాష్ట్ర బడ్జెట్-2023ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆయన ప్రతిపాదించారు.

  ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో తన బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి బుగ్గన అన్నారు. ఈ బడ్జెట్‌ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు. 

రాష్ట్రంలో 62శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. రైతుల ఆదాయం పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం తమదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరును ప్రపంచం మెచ్చుకుందని తెలిపారు. మిగిలిన 7,853 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో పాడిరంగం కీలక పాత్రం పోషిస్తుందని మంత్రి బుగ్గన తెలిపారు. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని వెల్లడించారు. పశువుల బీమా కోసం వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకం తీసుకొచ్చినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. రాష్ట్రంలో 340 సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 154 నియోజవర్గాల్లో జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేశామన్నారు. 

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..

❃ వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు

❃ వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు

❃ జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

❃  జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

❃  వైఎస్‌ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

❃  డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు

❃  రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు

❃  వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు

❃  జగనన్న చేదోడు రూ.350 కోట్లు

❃  వైఎస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు

❃  వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

❃  వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

❃  మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు

❃  రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

❃  లా నేస్తం రూ.17 కోట్లు

❃  జగనన్న తోడు రూ.35 కోట్లు

❃  ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

❃  వైఎస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

❃  వైఎస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు

❃  వైఎస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు

❃  అమ్మఒడి రూ.6500 కోట్లు

❃  మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు

❃  ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు

❃  వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు

❃  వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు

❃  మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు

❃  జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు

❃  పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు

❃  పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు

❃  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు

❃  యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు

❃  షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు

❃  షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు

❃  వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు

❃  కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు

❃  మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు

❃  పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు

❃  పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు

❃  రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు

❃  నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్‌) రూ.11,908 కోట్లు

❃  పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు

❃  ఎనర్జీ రూ.6,456 కోట్ల

❃  గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూ.3,858 కోట్లు

❃  గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు.

Thanks for reading AP Budget - 2023 key points

No comments:

Post a Comment