CTET December 2022 Results
CTET 2022 Result: సీటెట్ 2022 ఫలితాలు విడుదల
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్-2022 ఫలితాలను మార్చి 3న సీబీఎస్ఈ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో గతేడాది డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7, 2023 వరకు జరిగిన విషయం తెలిసిందే. సీటెట్ను 32 లక్షలకు పైగా అభ్యర్థులు రాశారు. పరీక్ష సమాధానాల ఫైనల్ కీ ఫిబ్రవరి 14న విడుదలైంది. అభ్యర్థులు సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్లో రోల్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
Thanks for reading CTET December 2022 Results
No comments:
Post a Comment