Poveglia Island: ఈ ప్రాంతం మానవ అవశేషాలతో నిర్మాణం.. ఇప్పటి వరకూ ఇక్కడకు వెళ్ళినవారు తిరిగిరాలేదు..
ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలున్నాయి. కొన్ని ప్రదేశాలు చరిత్రలో వెరీ వెరీ స్పెషల్ గా నిలుస్తాయి. కొన్ని ప్రాంతాల చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది.
మరికొన్ని చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల గురించి తెలుసుకుంటే భయంతో వణకాల్సిందే. ఈ రోజు ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాంతం గురించి తెలుసుకోనున్నాం. ఈ ప్రదేశంలో సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు. ఇలా నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర కూడా అంతే ప్రమాదకరమైనది.
ప్రపంచంలో అత్యంత భయంకరమైన నిషేధ ప్రాంతం ఇటలీలోని వెనిస్.. లిడో నగరాల మధ్య వెనీషియన్ గల్ఫ్. ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లోకి వెళ్లిన బతికి వచ్చిన మనిషి ఒక్కరూ లేరు. దీంతో నగరంలో సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది. ఈ ద్వీపం గురించి తెలుసుకున్న వారు శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు అంతేకాదు ప్రజలు దీనికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. 17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ప్రపంచానికి దూరంగా ఉంచుతూ చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి.
ఈ ద్వీపం ఎందుకు ప్రమాదకరమైనది అంటే
ఇటలీలో ప్లేగు మహమ్మారి వ్యాపించినప్పుడు బాధితులకు వైద్యం ఇచ్చే వీలు లేదని భావించిన ప్రభుత్వం దాదాపు 1.60 లక్షల మందిని ఈ ద్వీపంలోకి తీసుకుని వచ్చి వదిలేశారు. ఇలా చేయడం వలన వ్యాధి పెద్దగా వ్యాపించదని ప్రభుత్వం భావించింది. అప్పడు తాము ఈ చర్య తీసుకోవడం సరైనదని ప్రభుత్వం చెప్పింది. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే.. ఈ దేశం బ్లాక్ ఫీవర్ అనే మరో వ్యాధి బారిన పడటం ప్రారంభించారు. మళ్లీ ఈ ద్వీపం గురించి ప్రభుతం ఆలోచించడం ప్రారంభించింది. ఆ వ్యాధితో ఎవరు చనిపోయినా.. మరెవరూ ఆ వ్యాధి బారిన పడకుండా అక్కడ ద్వీపంలో ఖననం చేశారు. అందుకే ఈ ద్వీపంలోని సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు.
చాలా మంది ప్రజలు ఈ ప్రదేశాన్ని శాపగ్రస్తం అని పిలుస్తారు. అంతేకాదు.. అర్ధాయువుతో మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇక్కడ ఉన్నాయని స్థానికుల విశ్వాసం. అంతేకాదు ఈ ద్వీపం నుండి తరచుగా వింత శబ్దాలు వినిపిస్తాయని.. తాము విన్నామని చెబుతున్నారు. అందుకనే ఈ స్థలంలోకి వెళ్లడంపై నిషేధాజ్ఞలు విధించింది ప్రభుత్వం.
Thanks for reading Poveglia Island: This area is built with human remains.. Till now those who have gone here have not returned.
No comments:
Post a Comment