RRC Secunderabad: ఆర్‌ఆర్‌సీ సికింద్రాబాద్ గ్రూప్-డి తుది ఫలితాలు విడుదల
* 7,869 మంది ఉద్యోగాలకు ఎంపిక
* త్వరలో నియామక ఉత్తర్వులు
ప్రతిభ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి(లెవెల్-1, ప్రకటన నం.ఆర్‌ఆర్‌సీ 01/2019) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈమేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ), సికింద్రాబాద్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. లెవెల్-1 ఖాళీల భర్తీకి సంబంధించి గతేడాది ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు.. అలాగే ఈ ఏడాది జనవరిలో శారీరక సామర్థ్య పరీక్షలు, ఫిబ్రవరిలో ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మూడు దశల్లో ఉత్తీర్ణులైన 7,869 మంది అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో స్టోర్, డీజిల్, ఎలక్ట్రికల్, వర్క్‌షాప్ తదితర విభాగాల్లో.. అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలెట్, అసిస్టెంట్ వర్క్స్, పాయింట్స్‌మెన్ తదితర పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సీ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ కార్యాలయం ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందనున్నాయి.
Thanks for reading RRC Secunderabad: RRC Secunderabad Group-D Final Results Released
No comments:
Post a Comment