Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 26, 2023

TTD Alert: Alert for Shrivari Devotees.. Special Darshan tickets released today.. Book like this..


 TTD Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఇలా బుక్ చేసుకోండి..

  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వ స్వామి కొలువైపు పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుతుంటారు.

స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు. అలాంటి భక్తులు అందరికీ శుభవార్త.. నేడు ఏప్రిల్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది..

నేడు ఉదయం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలి సూచించింది.

ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. అయితే కేవలం తిరుమల అధికారిక వెబ్ సైట్లో మాత్రమే వీటిని బుక్ చేసుకోవాలని కోరింది.

ఇవి బుక్ చేయాలంటే కాస్త ముందస్తు ప్రిపరేషన్ ఉంటే చాలు.. ఈ టికెట్లు పొందడానికి రైల్వేలో తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకున్నట్లుగానే ముందుగానే తిరుమల వెంకన్న ఆర్జిత సేవలను పొందొచ్చు. https://ttdsevaonline.com సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందు కోసం సైట్లో సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

ఆ లింక్ ను క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ కాగానే ఏఏ తేదీలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తూ డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన తేదీని, స్లాట్ ను చెక్ చూసుకోవాలి. అందులో ఖాళీలు ఉంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది.. ఎన్ని ఖాళీలున్నాయో చూపిస్తుంది.

ఆవివరాలు నొక్కిన తరువాత టిక్కెట్ మొత్తం చెల్లిస్తే బుక్ అవుతుంది. చెల్లింపులు సాధారణ ఈకామర్స్ సైట్లలో, రైల్వే సైట్లో చెల్లింపులు ఉన్నట్లే ఉంటాయి. చెల్లింపు పూర్తయి మనకు సేవ బుక్ కాగానే కన్ఫర్మేషన్ మెసేజి వస్తుంది. అదనపు లడ్డూలు కావాలన్నా ఇదే సైట్లో బుక్ చేసుకోవచ్చు. 

మరోవైపు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఆదివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. చిరుజల్లుల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆదివారం ఉదయం స్వామివారు శంకు చక్రాలు, విల్లు బాణం, గద, ఖడ్గం పంచాయుధాలను ధరించి, సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఉదయం 8 నుండి 9:30 గంటల వరకు వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

Thanks for reading TTD Alert: Alert for Shrivari Devotees.. Special Darshan tickets released today.. Book like this..

No comments:

Post a Comment