మాంద్యంలో Warren Buffett సూత్రాలు.. 2023లో పెట్టుబడులకు మార్గనిర్దేశకాలు..!
Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఒకరు వారెన్ బఫెట్. మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై పెట్టుబడిదారులకు ఆయన కొన్ని సూత్రాలను అందించారు.
ఇవి ఎలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలో, వేటిని పరిగణలోకి తీసుకోవాలో మార్గనిర్ధేశకాలుగా నిలుస్తాయి.
ముందుగా వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్, వ్యవసాయ భూమి లేదా సేవలను ఉత్పత్తి చేసే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని సూచిస్తుంటారు. ఈ ఆస్తులు పెట్టుబడిపెట్టిన వారికి నగదు ప్రవాహాలను అంటే రిటర్న్స్ అందిస్తాయి. ఇవి మార్కెట్ పనితీరుతో సంబంధం లేకుండా ాదాయాన్ని అందిస్తుంటాయి. సమయం గడిచేకొద్ది వీరి యజమానులు రివార్డ్ చేయబడతారని 2021లో జరిగిన బెర్క్‌షైర్ హాత్వే ఇన్వెస్టర్ల యాన్యువల్ జనరల్ మీటింగ్ లో వెల్లడించారు.
రెండవ సూత్రం ఏమిటంటే ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ ఓపికతో ఉంటేనే మంచి రిటర్న్ పొందగలుగుతారు. దీనికోసం వారు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎక్కువకాలం సరైన మార్గాల్లో పెట్టుబడులు కొనసాగించటం వల్ల మంచి లాభాల ప్రతిఫలాన్ని పొందగలరని వారెన్ బఫెట్ ఎల్లప్పుడూ విశ్వసిస్తారు.
మూడో ముఖ్యమైన సూత్రం ఏమిటంటే ఉన్న డబ్బు మెుత్తాన్ని ఒకే విధమైన పెట్టుబడి మార్గంలో అస్సలు పెట్టకూడదు. అందుకే ఆయన డోన్డ్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ ఒన్ బాస్కెట్ అని అంటుంటారు. పెట్టుబడి పోర్ట్ ఫోలియోలో వైవిధ్యం చేయటం వల్ల అది మార్కెట్లలో వచ్చే అనేక ఒడిదొడుకుల నుంచి రక్షణను పొందుతుందని ఆయన సూచిస్తుంటారు. అందువల్ల పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు వాటి గురించి చాలా చదవాలని, నేర్చుకుని పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారెన్ బఫెట్ ఎల్లప్పుడూ ఇన్వెస్టర్లకు సూచిస్తుంటారు.
మార్కెట్ ఓలటాలిటీలకు ఇన్వెస్టర్లు అతిగా స్పందించటం మానుకోవాలని వారెన్ బఫెట్ హెచ్చరిస్తుంటారు. మార్కెట్లలో గందరగోళం నెలకొన్నప్పుడు ఆ హైప్ లో చిక్కుకుని అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరిస్తుంటారు. ఇన్వెస్టర్లు ప్రశాంతంగా ఉంటూ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలని 1987లో ఒక ప్రెస్ మీట్‌లో వారెన్ బఫెట్ అన్నారు.
చివరగా వారెన్ బఫెట్ ఇన్వెస్టర్లకు సూచించే ఈ సూత్రం అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది. ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీల్లో తమ డబ్బును ఇన్వెస్ట్ చేయాలని ఆయన సూచిస్తుంటారు. పెట్టుబడి పెట్టడానికి ముందు బలమైన బ్యాలెన్స్ షీట్, విశ్వసనీయ ఆదాయాలతో పాటు మంచి మేనేజ్‌మెంట్ టీమ్ వంటి దృఢమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీల కోసం మార్కెట్లో వెతకాలని అందరికీ సూచిస్తుంటారు. కంపెనీ మంచి వ్యాపార వృద్ధిని చూపిస్తే దానిని స్టాక్ ధర ప్రతిబింబిస్తుందని ఆయన చెబుతుంటారు. మాంద్యం వంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పుడు బఫెట్ పైన చెప్పిన 5 సూత్రాలు ఇన్వెస్టర్లు నష్టపోకుండా ఉండేందుకు తారక మంత్రాలుగా పనిచేస్తాయి.
Thanks for reading Warren Buffett's Principles in Recession..Guidelines for Investments in 2023..!
No comments:
Post a Comment