Amazon Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్!
Amazon Great Summer Sale: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేసవి ఆఫర్లను తీసుకొస్తోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో మే4 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గ్రేట్ సమ్మర్ సేల్ (Great Summer Sale)కు సిద్ధమైంది. ఈ సేల్ మే 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ యూజర్లు ఒక రోజు ముందే సేల్‌లో పాల్గొనే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. ఎన్నిరోజుల పాటు ఈ సేల్ నిర్వహించేదీ కంపెనీ వెల్లడించలేదు.ఈ సేల్‌లో మొబైల్స్, ఇతర ఉత్పత్తులను తగ్గింపు ధరలకే విక్రయించనుంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహాంద్రా బ్యాక్ డెబిట్‌కార్డు/ క్రెడిట్‌కార్డు దారులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ 14 తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది.
ఈ ఫోన్లపై ఆఫర్లు
శాంసంగ్ గెలాక్సీకి చెందిన రెండు ఫోన్లను భారీ డిస్కౌంట్‌తో ఇస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీకి ఎం33 5జీ (Samsung Galaxy M35 5g) ఫోన్ ఎమ్మార్పీ రూ.24,999 కాగా.. ఈ సేల్‌లో రూ.14,999కే విక్రయించనున్నారు. అలాగే, శాంసంగ్ గెలాక్సీ ఎం04 (Samsung Galaxy M04) ఫోన్ రూ.6,999కే కొనుగోలుచేయవచ్చు. ఈ సేల్‌లో వన్‌ప్లస్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. వన్‌ప్లస్ 10ఆర్ 5 జీ ఫోన్ రూ.34,999కే లభిస్తోంది. మార్కెట్‌లో కొత్తగా విడుదలైన వన్‌ప్లస్, షావోమీ, ఒప్పో, వివో బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను కూడా తగ్గింపు ధరకే ఈ సేల్‌లో కొనుగోలు చేయొచ్చని అమెజాన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఉండబోతోందని కంపెనీ పేర్కొంది. డిస్కౌంట్ ఎంతనేది వెల్లడించలేదు.
ఇదే సేల్‌లో టీవీలు, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్లు, ఐప్యాడ్లు, ప్రింటర్ల పై దాదాపు 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని అమెజాన్ పేర్కొంది. గృహోపకరణాలు, వంటింటి వస్తువులపై 70 శాతం డిస్కౌంట్, ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులపై 50-80 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. అమెజాన్ ఫైర్‌స్టిక్, అమెజాన్ ఎకో డాట్ వంటి ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.
Thanks for reading amazon Sale: Amazon Great Summer Sale.. Big Discount on iPhone 14!
No comments:
Post a Comment