Bank Holidays in May 2023: కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays In MAY 2023
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. వచ్చే నెల అంటే మే నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. వినియోగదారులు ముందస్తుగా గమనించి బ్యాంక్ పనులను ప్లాన్ వేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్..
Bank Holidays In May 2023
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. వచ్చే నెల అంటే మే నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. వినియోగదారులు ముందస్తుగా గమనించి బ్యాంక్ పనులను ప్లాన్ వేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. బ్యాంకుల పని నిమిత్తం చాలా మంది వెళ్తుంటారు. అయితే ముందస్తుగా బ్యాంకు సెలవులను గుర్తించుకుని ప్లాన్ చేసుకుంటే సమయం వృధా కాకుండా ఉండడమే కాకుండా కొంత ఆర్థిక నష్టం కూడా వాటిల్లకుండా చూసుకోవచ్చు. ప్రతి నెల, పండుగలు, వారాంతాల్లో కూడా దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనించాలి. మరి మే నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో తెలుసుకుందాం.
మే 1 – మేడే
మే 5 – బుద్ద పూర్ణిమ
మే 7- ఆదివారం
మే 9- రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
మే 13 – రెండో శనివారం
మే 14- ఆదివారం
మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కింలో మాత్రమే)
మే 21- ఆదివారం
మే 22- మహారాణా ప్రతాప్ జయంతి
మే 24- కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి (త్రిపురాలో)
మే 27- నాలుగో శనివారం
మే 28- ఆదివారం
రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి.
ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.
Thanks for reading Bank Holidays in May 2023
No comments:
Post a Comment