Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఫోన్‌లపై భారీ ఆఫర్లు!
Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేసవిలో సరికొత్త ఆఫర్లతో సేల్‌కు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో మే 5 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale)ను ప్రకటించింది. ఈ సేల్ మే 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 10 వరకు ఆరు రోజులపాటు కొనసాగనుంది. ఇందులో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ యూజర్లు ముందుగానే పాల్గొనే అవకాశం ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సివుంది. ఈ సేల్‌లో కొన్ని మొబైల్ మోడల్స్‌పై భారీగా ఆఫర్లు ప్రకటించారు. ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ, గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి ప్రీమియం ఫోన్లు కూడా ఉన్నాయి.
ఆఫర్లు వీటిపైనే
ఈ సేల్‌లో బడ్జెట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. పోకో(Poco) సీ55 ధర ₹ 11,999 కాగా.. ఈ సేల్‌లో ₹ 7,999కే విక్రయించనున్నారు. అలాగే ఇన్ఫీనిక్స్(Infinix) హాట్ 20 5జీ ఫోన్ ధర ₹ 17,999 కాగా.. ₹ 9,999కే కొనుగోలు చేయొచ్చు. ₹ 10,999 ధర కలిగిన మోటో(Moto) ఈ13 ఫోన్‌ను ఈ సేల్‌లో ₹ 7,499కే విక్రయించనున్నారు. రెడ్‌మీ(Redmi) నోట్ 12 ప్రో 5జీ మోడల్ ధర ₹ 29,999 కాగా.. ₹ 21,749కే కొనుగోలు చేయొచ్చు. రియల్‌మీ(Realme) 10ప్రో+ 5జీ ధర ₹ 25,999 కాగా.. ఈ సేల్‌లో ₹ 22,999కే విక్రయించనున్నారు. అలానే, పోకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్ ధర ₹ 25,999 కాగా.. ₹ 20,999కే కొనుగోలు చేయొచ్చు.
గూగుల్ పిక్సెల్ (Google Pixel) ఫోన్‌లపై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 6ఏ ధర ₹ 43,999 కాగా.. ఈ సేల్‌లో ₹ 25,999కే లభిస్తుంది. ఇక, పిక్సెల్ 7 మోడల్ ధర ₹ 59,999 ఉండగా.. ₹ 44,999కే కొనుగోలు చేయొచ్చు. వీటితోపాటు శాంసంగ్ (Samsung) గెలాక్సీ జెడ్ ఫ్లిప్3, శాంసంగ్ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ, ఐఫోన్ 13 (iPhone 13) మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్ ఉండబోతోందని కంపెనీ పేర్కొంది. డిస్కౌంట్ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. మే 1 నుంచి కర్టైన్ రైజర్ డీల్స్ (Curtain Raiser Deals) పేరుతో వేటిపై ఎంత ఆఫర్లు ఉంటాయనే వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించనుంది. అయితే ఈ సేల్‌లో టీవీ, హోమ్ అఫ్లియెన్సెస్‌పై 70 శాతం వరకు.. ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్లు, ఐప్యాడ్లు, ప్రింటర్లు వంటి వాటిపై దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని సమాచారం.
Thanks for reading flipkart: Flipkart Big Saving Days Sale.. Huge Offers on Phones!
No comments:
Post a Comment