Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 5, 2023

Hanuman Jayanti: What is special about Hanuman Jayanti? What to do on this auspicious day?


 Hanuman Jayanti: హనుమాన్‌ జయంతి ప్రత్యేకతలేంటి?ఈ పవిత్రమైనరోజు చేయాలి?

Hanuman Jayanti 'కలౌ కపి వినాయకౌ' అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్లని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో.. అక్కడ ఆంజనేయుడు కచ్చితంగా ఉంటాడని భక్తుల విశ్వాసం.

 'కలౌ కపి వినాయకౌ' అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్లని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో.. అక్కడ ఆంజనేయుడు కచ్చితంగా ఉంటాడని భక్తుల విశ్వాసం. ఏప్రిల్‌ 6 2023 గురువారం చైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమినాడు హనుమంతుడు జన్మించినటువంటి పవిత్రమైన రోజు. 'యత్ర యత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్, భాష్పవారి పరిపూర్ణ లోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్' అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన హనుమంతునికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అని అర్థం. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో చైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోగా.. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమినాడు నిర్వహిస్తుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్‌ జయంతి జరుపుతారు. తెలుగు హనుమాన్ జయంతి పర్వదినాన ఆ భగవంతుడిని స్మరిస్తూ నేలపై నిద్రిస్తే చాలా మంచిది. అలా నేలపై నిద్రిస్తే ఆరోగ్య సిద్ధితో పాటు వాత రోగాలు దూరమవుతాయి. శరీరం, మనస్సుపై నియంత్రణ కలుగుతుంది.  రామాయణం ప్రకారం, శ్రీరామచంద్రునికి ఆంజనేయుడు అత్యంత విధేయుడు, విశ్వాసపాత్రుడు, నమ్మిన బంటుగా ఉంటాడు. హనుమంతుడు శివుని అంశతో పుట్టాడని పండితులు చెబుతుంటారు.

ఆ రోజు ఏం చేయాలి?

హనుమాన్‌ జయంతి రోజున సూర్యోదయం సమయంలో ఆంజనేయుడిని ఆరాధించాలి. ఈరోజు హనుమాన్ భక్తులందరూ ప్రత్యేక ఉపవాసం పాటించాలి. కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి. ఈ పవిత్రమైన రోజున నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలి. శ్రీరాముడు, సీతాదేవి, హనుమాన్‌లను గుర్తు చేసుకొనేందుకు మీరు బ్రహ్మ ముహుర్తాలలో మేల్కొవాలి. తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేయాలి. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో హనుమంతుడికి పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో పాటు భజరంగీ మంత్రాలను పఠించాలి. 

ఆ భయాలు తొలగుతాయి..!

ఆంజనేయుడు ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నాడని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే ఆ దేవుడు చిరంజీవిగా ఉండటానికి దీవించబడ్డాడు. ఎవరైతే పవన పుత్రుడిని స్వచ్ఛమైన భక్తిభావనతో ఆరాధిస్తారో.. అలాంటి వారికి కష్టాల నుంచి విముక్తి లభించడంతో పాటు పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది. మీ జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుంది. అంతేకాదు,  శని ప్రభావం ఉండే వారు కూడా.. ఆంజనేయుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఆంజనేయుని ఆశీర్వాదం పొందడానికి, హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన కలిగిన నూనె, సింధూరాన్ని అర్పించాలి. ఈ రోజున సుందరకాండ పారాయణం, రామలక్ష్మణ చరితం, భజరంగబలి పఠనం చేయాలి. శివుని అంశ, వాయు పుత్రుడు.. అర్జునుడికి ప్రియ సఖుడు.. శ్రీరామదాసుడు.. ఎర్రని కన్నులుగలవాడు.. అమిత విక్రముడు.. సాగరాన్ని దాటినవాడు.. లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు.. సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు.. పది తలలున్న రావణుని గర్వం అణచినవాడు.. ఈ హనుమంతుని నామాలు ప్రయాణం సమయంలో, నిద్రపోయే ముందు స్మరించిన వారికి చావు గురించి భయం ఉండదు. వీరికి సర్వత్రా విజయం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈరోజు హనుమంతునికి పూజలు చేసి ఆరాధిస్తే శని బాధలు తొలగడంతో పాటు ఆరోగ్య సిద్ధి, మానసిక ప్రశాంతత, భూత ప్రేత పిశాచ భయాల నుంచి విముక్తి కలుగుతుంది.

Thanks for reading Hanuman Jayanti: What is special about Hanuman Jayanti? What to do on this auspicious day?

No comments:

Post a Comment