Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 31, 2023

Day 32: Students Summer Holidays Activities


    

Day 32: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:32 Activities

Class: 1,2
32 వ రోజు 

To develop oral language skills

Q) Tell the different objects in the kitchen and their uses and ask your parent to make a video.

తెలుగు:

Q) కింది ఎత్వం దీర్ఘం ఉన్న పదాలు చదువుతో రాయండి.

కేక
చేప
పేరు
మేక
తేనె

English:

Q) Learn and write ' P ' words.

Pen           🖋️

Pencil       ✏️

Parrot        🦜

Pineapple    🍍

Pig               🐖

Maths:

Q) Do the following Additions.

              2   4
         +   5   3
        ...................
        ...................

              4   6
         +   2   8
        ...................
        ...................

              6   7
         +   5   9
        ...................
        ...................

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Surface =ఉపరితలము.

Produce = ఉత్పత్తి చేయు.

Building =నిర్మాణము.

Ocean =మహాసముద్రము.

Class = తరగతి.

Note =సూచన.

Nothing =ఏమీ లేదు.

Rest =మిగిలిన,విశ్రాంతి.

Carefully = జాగ్రత్తగా.

Scientists = శాస్త్రవేత్త.

Inside = లోపలివైపున.

Wheels = చక్రములు.

Stay = ఉండు,నిలిచిఉండు.

Green = పచ్చని.

Known = తెలిసిన.










  
Class :3,4,5
32వ రోజు 

Q) వేటగాడు - పావురాలు కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు  మీ నోటు పుస్తకం లో రాయండి. 

Q) Identify and circle the key words in the story 'Hunter - Doves '. Read and write the key words 5 times in your note book.
👇👇👇
👇👇





💎నేటి ఆణిముత్యం

మెదడు పాడుచేయు, మేనెల్ల చెడగొట్టు,
కీర్తి నపహరించు, నార్తి పెంచు,
క్రూరజనుల మైత్రి కుష్ఠురోగమ్మురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం :
 
చెడ్డవారితో చేసే స్నేహం ఎలాంటి ఉపద్రవాలను మిగులుస్తుందో చెప్పుకువస్తున్నారు ఈ పద్యంలో. అది మన విచక్షణని దెబ్బతీస్తుందట, శరీరానికీ చెరుపు చేస్తుందట, ఉన్న పేరు కాస్తా ఊడ్చిపెట్టుకుపోతుందట, మనసులో ఎంతకీ తరగని అలజడి మొదలవుతుందట... అంతదాకా ఎందుకు దుర్మార్గుడితో స్నేహం కుష్టురోగంతో సమానం అంటున్నాడు శతక కర్త శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.

🤠 నేటి సామెత 
కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే.... దూడ గడ్డి కొసమన్నాడట

ఆబద్దం కూడా అతికినట్టు చెప్పలేని వారి గురించి ఈ సామెత వాడతారు

🗣నేటి జాతీయం

ఎండగట్టడం
బాగా బాధించటం, తీవ్రంగా విమర్శించటం 
ఉదా:- ఈ నాడు దేశంలో పాతుకు పోయిన అవినీతిని అన్నా హజారే ఎండగడుతున్నాడు.
🤘నేటి సుభాషితం

నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవ్వరికి లేదు కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

👬 నేటి చిన్నారి గీతం
పాయసం

పప్పు పెట్టి పాయసం పెట్టి
అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి
కూర పెట్టి ఊరగాయ పెట్టి
నెయ్యిపోసి ముద్ద చేసి
ముద్దచేసి తినిపించి
చేయి కడిగి మూతికడిగి
తాతగారింటికి దారేదండీ
అత్తారింటికి దారేదండీ
ఇట్లా పోయి అట్లా పోయి
అదిగో వచ్చాం ఇదిగో వచ్చాం
చక్కా వచ్చాం చక్కగవచ్చాం
చక్కిలి గిలిగిలి చక్కిలి గిలి

✍🏼 నేటి కథ 

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.

రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.

కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. "అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను" అంది కోపంగా.

"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!" అని కుందేలు బదులు పలికింది.కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.

ఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి.
తెలుసు కుందాం

🟥సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?🦋
🟩మామూలుగా సీతాకోకచిలుకలు ఉన్న ప్రాంతాల్లోనే ఒక చెట్టుమీది పూల నుంచి మరో చెట్టుమీద పూలపైకి వాలుతుంటాయి. కానీ కొన్ని తెగల సీతాకోక చిలుకలు ఎగురుతూ అత్యంత దూరాలు పయనిస్తాయి. అలాంటి వాటిలో అమెరికాలో ఉండే 'అమెరికన్‌ మోనార్క్‌' బటర్‌ఫ్త్లెలు ఉత్తర అమెరికా నుంచి శరత్‌కాలంలో (autumn)లో బయలు దేరి మెక్సికోను చేరుకొని అక్కడ శీతాకాలమంతా జీవనం సాగిస్తాయి. ఈ కీటకాలు 3000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరాన్ని 8 నుంచి 12 వారాల్లో పయనిస్తాయి. ఇవి రోజుకు సరాసరి 70 కిలోమీటర్ల దూరం పయనించగలవు. గాలివాటం అవి పయనించే దిశకు అనుకూలంగా ఉంటే రోజుకు 300 కిలోమీటర్ల దూరం కూడా పయనించగలవు. అవి తమ ప్రయాణంలో ఆకాశంలో ఉండే సూర్యుడు ఉండే స్థానాన్ని మార్గ నిర్దేశకంగా ఉపయోగించుకుంటాయి. శీతాకాలం చివరలో అవి మరలా తమ స్వస్థలాలకు బయలుదేరక ముందే గుడ్లనుపెట్టి, వాటిలోని ఆడకీటకాలు చాలామటుకు, మగకీటకాల్లో కొన్ని మరణించడంతో, మిగిలిన సీతాకోకచిలుకలు వాటి సంతతితో తమ స్వస్థలాలకు చేరుకొంటాయి.

Thanks for reading Day 32: Students Summer Holidays Activities

No comments:

Post a Comment