Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 31, 2023

Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification


 Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification

IBPS RRB 2023 Notification: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల

* జూన్‌ 28 దరఖాస్తుకు గడువు

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌)... రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి మే 31న సంక్షిప్త ప్రకటనను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ జూన్‌ 1న విడుదల కానుంది. అలాగే పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 1న ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ షెడ్యూల్‌...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఫీజు చెల్లింపు/ దరఖాస్తు సవరణ తేదీలు: 01.06.2023 నుంచి 28.06.2023 వరకు.

ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 17.07.2023 నుంచి 22.07.2023 వరకు.

ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: ఆగస్టు, 2023.

ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడి: ఆగస్టు/ సెప్టెంబర్‌, 2023.

మెయిన్స్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌, 2023.

ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌, 2023

IBPS CRP RRB: ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌)... రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ప్రకటనను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 8612 గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 1న ప్రారంభమైంది.అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు:

1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5538 పోస్టులు

2. ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2485 పోస్టులు

3. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 332 పోస్టులు

4. ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 68 పోస్టులు

5. సీఏ ఆఫీసర్ స్కేల్-2: 21 పోస్టులు

6. లా ఆఫీసర్ స్కేల్-2: 24 పోస్టులు

7. ట్రెజరీ మేనేజర్ స్కేల్-2: 08 పోస్టులు

8. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 03 పోస్టులు

9. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్-2: 60 పోస్టులు

10. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్): 73 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (01-06-2023 నాటికి): ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా 

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 01.06.2023 నుంచి 28.06.2023 వరకు.

అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు: 01.06.2023 నుంచి 21.06.2023 వరకు.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్:  10.07.2023.

ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు: 17.07.2023 నుంచి 22.07.2023 వరకు.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్:  జులై/ ఆగస్టు, 2023.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి:  సెప్టెంబర్, 2023.

ఆన్‌లైన్ మెయిన్స్‌ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్, 2023.

ఆన్‌లైన్ మెయిన్స్‌ పరీక్ష తేదీ: సెప్టెంబర్, 2023.

మెయిన్స్‌ ఫలితాల వెల్లడి: (ఆఫీసర్‌ స్కేల్ 1, 2, 3): అక్టోబర్, 2023.

ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2023.

ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3):  అక్టోబర్/ నవంబర్, 2023.

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)): జనవరి, 2024.


Website Here

Notification Here

Apply Now Here

Thanks for reading Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification

No comments:

Post a Comment