IPL 2023 Final: ఐపీఎల్ టైటిల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ఐపీఎల్-16 సీజన్ ఫైనల్ (IPL 2023 Final)లో గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. మరి టైటిల్ విజేతగా నిలిచే జట్టు ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకోనుంది, రన్నరప్ ఎంత మొత్తం దక్కించుకుంటుంది అనే విషయాలను తెలుసుకుందాం.
ఐపీఎల్-16 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. ఈ టైటిల్ పోరు (IPL Final 2023)లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. మరి విజేతగా నిలిచే జట్టు ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకోనుంది, రన్నరప్‌గా నిలిచిన టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఓ క్రీడాఛానల్ నివేదిక ప్రకారం.. ఈ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచే జట్టు రూ.20 కోట్లు ప్రైజ్‌మనీని దక్కించుకుంటుంది. రన్నరప్‌గా నిలిచే టీమ్‌కు రూ. 13 కోట్లు ఇవ్వనున్నారు. అదే విధంగా మూడో స్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్ రూ. 7 కోట్లు దక్కించుకోనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు రూ.6.5 కోట్లు ఇవ్వనున్నారు.
ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడికి ఎంతంటే?
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ అందిస్తారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో గుజరాత్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ 851 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడికి రూ.15 లక్షల క్యాష్ రివార్డు అందించనున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ అందిస్తారు. ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌కు కూడా రూ.15 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ప్రస్తుతం గుజరాత్ పేసర్ మహ్మద్ షమి 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ (27), మోహిత్ శర్మ (24) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ప్లేయర్‌కు రూ.20 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వారికి రూ.12 లక్షలు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ఆటగాడు రూ.15 లక్షలు, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ప్లేయర్ రూ.12 లక్షలు దక్కించుకుంటారు.
Thanks for reading IPL 2023 Final: Do you know the prize money given to the IPL title winner?
No comments:
Post a Comment