Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 27, 2023

Day 28: Students Summer Holidays Activities


   

Day 28: Students Summer Holidays Activities


Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేసవి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:28 Activities

Class: 1,2
28 వ రోజు

To develop communication and creativity skills:

Q) Practice One story with action and ask your parent to make a video.

తెలుగు:

Q) ఆలోచించి ఖాళీలలో రాయండి.

1. పసుపు రంగు పూవు: ..............
2. మీరు చూసిన జంతువు: ...........
3. పాప .............. తాగింది.
4. నేను .............. తరగతి.
5.  నేను చూసిన సినిమా : ............

English:

Q) Write the missing letters.

N - s e         👃

N - t            🥅

N i - e           9️⃣

N a i - s           💅

N - t e book   📖

N i - h t           🌃

Maths:

Q) Write the expanded form.

60 = 60 + 0
61 = 60 + 1
62 = 60 + 2
63 = .... + ......
64 = .... + ......
65 = .... + ......
66 = .... + ......
67 = .... + ......
68 = .... + ......
69 = .... + ......
70 = .... + ......
71 = .... + ......
72 = .... + ......
73 = .... + ......
74 = .... + ......
75 = .... + ......
76 = .... + ......
77 = .... + ......
78 = .... + ......
79 = .... + ......
80 = .... + ......

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Products =ఉత్పత్తులు.

Happened = సంభవించెను.

Whole = మొత్తము.

Measure = కొలుచు.

Remember = గుర్తుతెచ్చుకొను.

Early = ముందుగా

Waves =అలలు.

Listen =వినుట.

Wind =గాలి.

Rock =రాయి.

Space =విశాల విశ్వం,ఖాళి స్థలం.

Covered = కప్పి ఉంచెను.

Fast = వేగమయిన.

Several = వివిధములైన, రకరకాలైన.

Hold = పట్టుకొనెను.






Class :3,4,5

28వ రోజు 

Q) సింహం మరియు ఎలుక  కథను చదువుతూ మీ నోటు పుస్తకం లో రాయండి.

Q) Read and write the story 'The Lion And The Mouse ' in your note book.

👇👇👇






💎నేటి ఆణిముత్యం

తమ్ములు తమయన్న యెడ భ
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!

తాత్పర్యం:

రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది.

🤘నేటి సుభాషితం

ఇద్దరు చేసినఆలోచన మూడోవాడికి తెలిసిందా! రహస్యం అంతా బట్ట బయలు అయినట్టే

👬 నేటి చిన్నారి గీతం 

గురువు మాట వినాలి

 ప్రొద్దున మనము లేవాలి   - పళ్ళను బాగా తోమాలి
చక్కగ స్నానం చేయాలి - చింపిరి తలనూ దువ్వాలి
ఉతికిన బట్టలు కట్టాలి   - గ్లాసెడు పాలు తాగాలి
దేవునికి దండం పెట్టాలి   - చక్కగ బడికి పోవాలి
గురువు మాట వినాలి       - చదువులు చక్కగ చదవాలి.
🤠 నేటి సామెత 

వెండ్రుకలున్నమ్మ ఏ కొప్పైనా వేయగలదు

మనకున్న వనరులను బట్టి పని చేయాలి. అంతే గాని ఆశగా మనకున్న వనరుల కన్న ఎక్కువున్న పనిని చేయ కూడదు: అలాంటి సందర్భాలలో పుట్టినదే ఈ సామెత. వెండ్రుకలున్న అమ్మ ఏ కొప్పైనా వేయ గలదు. సరిపడ వెండ్రుకలు లేనిదే కొప్పేం వేయ గలదు?
🗣నేటి జాతీయం

"ఊపునివ్వడం

ప్రోత్సాహమివ్వడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. స్తబ్ధంగా ఉన్నప్పుడు ఒకచోట పడిఉండడం తప్ప మరేవిధమైన పని జరగడానికి వీలుండదు. అదే కదలికలో ఉన్నప్పుడు, అది కూడా మంచి వూపుతో ఉన్నప్పుడు కార్యసాధనకు వీలు కలుగుతుంది. ఈ చలనాత్మక దశలో ఉన్న శక్తిని సూచించే విధంగా వూపునివ్వడం అనేది కార్యసాధనకు ఉద్యమించేలా చేయడం, కదలికను తెప్పించడం, ప్రోత్సాహాన్ని కలిగించడం అనేలాంటి అర్థాలలో ప్రయోగంలోకి వచ్చింది.

ఉదా: 'ఆ నాయకుడి ప్రసంగం అందరికీ మంచి ఊపునిచ్చింది'.
✍🏼 నేటి కథ 

తెలివిగల చేప

ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది. ప్రతిరోజూ మూడుపూట్లా హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి. ప్రతిరోజూ తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామేవ్వరమూ మిగలమని తెలుసుకొని, ఒకరాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకొనే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల నాకొక ఉపాయం తట్టింది, కాని దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి.

      చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించటం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమైఉంటుందో అని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోడానికి ముందుకు వచ్చింది. కాని ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్ళు తాగబోయింది. ఈలోగా ఒక పెద్దచేప దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి, నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి.

తెలుసు కుందాం

🟥మంచులో శవం పాడవదేం? Why don'ot corpse spoil in ice?

🟩మంచుగడ్డల్లో పడ్డ మృతదేహం వందల సంవత్సరాలైనా చెడిపోదు. కానీ బతికున్న మనం మంచు గడ్డల్లో కొన్ని గంటలుంటే చనిపోతాము. ఈ వైవిధ్యం ఏమిటి?

జీవకణంలో రసాయనిక, భౌతిక చర్యలు సజావుగా సాగినప్పుడే జీవం ఉంటుంది. ఆ చర్యలకు ఉష్ణోగ్రత కూడా అనువుగా ఉండాలి. ఉష్ణోగ్రత అధికంగా పెరిగినా, బాగా తగ్గిపోయినా జీవచర్యలు అదుపు తప్పుతాయి. అందువల్లనే విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు, లేదా విపరీతమైన ఎండలున్నప్పుడు మనిషి చనిపోతాడు. అలాగే మంచు గడ్డల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద కూడా మరణం ఏర్పడుతుంది. ఇక మృతదేహం చెడిపోవడమంటే, దాని మీద వాతావరణం, మట్టి, నీరు తదితర పరిసరాల్లో ఉండే సూక్ష్మజీవులు దాడి చేసి, అందులోని మాంసకృత్తుల్ని, ఇతర పదార్థాలను గ్రహించడమే. ఆ సూక్ష్మజీవులు తమ ప్రతాపం చూపాలన్నా కూడా వాటికీ అనువైన ఉష్ణోగ్రత ఉండాల్సిందే. అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవులు తమ దాడిని కొనసాగించలేవు. సంతానాన్ని వృద్ధి చేసుకోలేవు. అందువల్లనే మంచుపర్వతాల్లో మరణించినవారి శరీరాలు వేలాది ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉంటాయి. అల్ప ఉష్ణోగ్రతల వద్ద సూక్ష్మజీవులు పనిచేయలేవు కాబట్టే, ఫ్రిజ్‌లో పెట్టిన పదార్థాలు చెడిపోవు.

Thanks for reading Day 28: Students Summer Holidays Activities

No comments:

Post a Comment