UPSC NDA & NA II Exam 2023: Registration begins at upsc.gov.in
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2023 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 02-07-2024 నుంచి ప్రారంభమయ్యే 152వ కోర్సులో, 114వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్ 6లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
యూపీఎస్సీ – నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (2) – 2023
ఖాళీలు: మొత్తం 395 ఖాళీలకు ప్రకటన వెలువడింది. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్- 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయసు: అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 02-01-2005కి ముందు, 01-01-2008కి తర్వాత పుట్టి ఉండకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్ / ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 17, 2023
దరఖాస్తు చివరి తేది: జూన్ 06, 2023
Thanks for reading UPSC NDA & NA II Exam 2023: Registration begins at upsc.gov.in
No comments:
Post a Comment